ఈగల్ కి ఆ ఛాన్స్ ఇస్తారా?
అయితే సంక్రాంతి రేసులో ఏకంగా ఐదు సినిమాలు పోటీలో ఉండేసరికి థియేటర్స్ దొరకడం కష్టం అయిపొయింది.
By: Tupaki Desk | 6 Jan 2024 3:30 PM GMTమాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈగల్. ఈ మూవీ నిజానికి సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించింది. అయితే సంక్రాంతి రేసులో ఏకంగా ఐదు సినిమాలు పోటీలో ఉండేసరికి థియేటర్స్ దొరకడం కష్టం అయిపొయింది. దానికితోడు నిర్మాతల మండలి అందరిని కోర్చోబెట్టి మాట్లాడారు.
ఈ చర్చల తర్వాత ఫైనల్ గా ఈగల్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. వారికి సింగిల్ డేట్ వచ్చే విధంగా చూస్తామని దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ మాట ఇచ్చారు. అందులో భాగంగా ఫిబ్రవరి 8న రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. నిజానికి ఆ రోజు మూడు సినిమాలు ఇప్పటికే డేట్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. అందులో సితార నుంచి టిల్లు స్క్వేర్ ఉంది. అలాగే యూవీ నుంచి యాత్ర 2 రిలీజ్ కానుంది. 14 రీల్స్ నుంచి ఊరు పేరు భైరవకొన కూడా రిలీజ్ కన్ఫర్మ్ చేశారు.
వీటిలో గుంటూరు కారం సినిమాకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సితార వారు టిల్లు స్క్వేర్ ని వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది. కాని యూవీ నుంచి రాబోతున్న యాత్ర2, ఊరుపేరు భైరవకొన మాత్రం సందేహమనే చెప్పాలి. ఇందుకంటే ఈ చిత్ర నిర్మాతలతో నిర్మాతల మండలి చర్చించలేదని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో సదరు నిర్మాతలు అయితే డేట్ మార్చుకోవడానికి సిద్ధంగా లేరనే ప్రచారం నడుస్తోంది.
యాత్ర 2 సినిమాకి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఈగల్ సినిమాని నిర్మించిన విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి సపోర్టర్. ఈ పరిస్థితిలో యాత్ర2ని ఆపే ప్రయత్నం చేస్తే వివాదం తలెత్తే ఛాన్స్ ఉంది. ఊరు పేరు భైరవకోన సినిమా విషయంలో అనిల్ సుంకరని సంప్రదించకపోవడంతో ఆయన తగ్గేదిలే అంటున్నారు.
ఈగల్ తో చూసుకుంటే బడ్జెట్ పరంగా, స్పాన్ పరంగా ఆ మూడు చిన్న సినిమాలు అయిన దేనికి ఉండాల్సిన బజ్ దానికి ఉంది. ఈ పరిస్థితిలో ఫిబ్రవరి 8 డేట్ ని ఈగల్ సినిమాకి ఏ ప్రాతిపాదిక మీద కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.