Begin typing your search above and press return to search.

ప్రభుదేవతో అనసూయ..వూల్ఫ్ టీజర్ ఎలా ఉందంటే?

ఆయన కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాదు మూవీలకు దర్శకత్వం కూడా వహించారు

By:  Tupaki Desk   |   3 Aug 2023 8:09 AM GMT
ప్రభుదేవతో అనసూయ..వూల్ఫ్ టీజర్ ఎలా ఉందంటే?
X

స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ తెలియనివారు ఉండరు. ఆయన కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాదు, మూవీలకు దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు, నటుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన తాను ప్రధాన పాత్రలో చాలా రకాల సినిమాలు చేశారు. అయితే, తాజాగా వూల్ఫ్ అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.


తాజాగా, ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ చాలా భిన్నంగా కనపడుతోంది. టీజర్ కొంత సేపు మామూలుగా కనపడుతున్నా, మరి కొంతసేపు ఏదో వేరే లోకంలో ఉన్నారా అనే భావన కలుగుతోంది. మొత్తం ప్రభుదేవ, అనసూయ, లక్ష్మీ రాయ్ అందరూ వేర్వేరు గెటప్స్ లో కనపడుతున్నారు.

అంతేకాదు అనసూయ, లక్ష్మీ రాయ్ ఇద్దరూ ప్రభుదేవా కోసం పోటీపడుతున్నట్లుగా కనపడుతున్నారు. మూవీ ట్రైలర్ విడుదల చేస్తే కానీ, కథ ఏంటి అనేది క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా, ఈ మూవీ టైటిల్ ప్రకటించినప్పటి నుంచే వివాదం మొదలైంది. మూవీ టైటిల్ ని తెలుగులో తప్పుగా ప్రింట్ చేశారు. వూల్ఫ్ కి బదులు వూల్ఫ అని ప్రకటించారు. సోషల్ మీడియాలో అందరూ విమర్శల వర్షం కురిపించడంతో, మళ్లీ టైటిల్ మార్చి, కరెక్ట్ గా ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఇది ప్రభుదేవా 60వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో రాయ్‌ల‌క్ష్మి, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. వూల్ఫ్‌తోపాటు త‌మిళంలో ఫ్లాష్‌బ్యాక్ అనే సినిమా చేస్తున్నాడుప్ర‌భుదేవా. ఇందులోనూ అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తుండటం విశేషం.

కాగా, కోరియోగ్రఫర్‌‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్‌ చేసి భారీ హిట్ కొట్టాడు.