ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లాప్ చిత్రం?
ఫలితంగా పంపిణీదారులు, బయ్యర్లు భారీ నష్టాలను చవిచూశారు. ఈ సినిమాని రూ. 1300 కోట్ల బడ్జెట్ ని ఆరోజుల్లోనే ఖర్చు చేశారంటే అర్థం చేసుకోవాలి.
By: Tupaki Desk | 6 Sep 2024 1:30 PM GMTదశాబ్ధాల క్రితమే వందల కోట్ల బడ్జెట్లతో హాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కేవి. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన హాలీవుడ్ చిత్రం పంపిణీవర్గాలను తీవ్ర నష్టాల్లో ముంచేసింది. ఇందులో సూపర్ స్టార్లు నటించారు.. కానీ వారి స్టార్ డమ్ పరాజయాన్ని నిలువరించలేకపోయింది. ఫలితంగా పంపిణీదారులు, బయ్యర్లు భారీ నష్టాలను చవిచూశారు. ఈ సినిమాని రూ. 1300 కోట్ల బడ్జెట్ ని ఆరోజుల్లోనే ఖర్చు చేశారంటే అర్థం చేసుకోవాలి.
నిజానికి మేకర్స్ అంత పెద్ద డబ్బు వెచ్చించి ఒక కళాఖండాన్ని నిర్మించాలని సాహసించారు. కానీ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా టైటిల్ `ది థర్టీన్త్ వారియర్`. ఈ చిత్రం 1999లో విడుదలైంది. అమెరికన్ హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ఇది. అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్‌గా ఆంటోనియో బాండెరాస్, డయాన్ వెనోరా, ఒమర్ షరీఫ్ లాంటి భారీతారాగణం ఈ చిత్రంలో నటించారు. దీనికి జాన్ మెక్‌టైర్నన్ దర్శకత్వం వహించారు. ది థర్టీన్త్ వారియర్ మైఖేల్ క్రిక్టన్ 1976 నవల `ఈటర్స్ ఆఫ్ ది డెడ్` ఆధారంగా రూపొందించారు. అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ అనే బాగ్దాదీ యాత్రికుడి కథను ఇందులో తెరపై చూపించారు.
ఈ చిత్రం తొలిసారిగా ఓ ముస్లింని హీరోగా చూపించింది. `ది థర్టీన్త్ వారియర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడమే కాకుండా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో డాక్టర్ రెజా అస్లాన్ అనే విమర్శకుడు ఇలా రాసారు. హాలీవుడ్‌లో ఎవరూ మళ్లీ ముస్లిం హీరో ఆధారంగా సినిమా తీయడానికి సాహసించలేరని కూడా అన్నారు.
160 మిలియన్ డాలర్ల (రూ. 1300 కోట్లు) బడ్జెట్‌తో రూపొందిన `ది థర్టీన్త్ వారియర్` ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కేవలం 61 మిలియన్ డాలర్లు (రూ. 511 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం 129 మిలియన్ డాలర్ల మేర (రూ. 1082 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.