Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : బాహుబలి 'పిజ్జా'తో బుట్టబొమ్మ

హీరోయిన్‌ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్‌ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   10 Feb 2024 7:31 AM GMT
పిక్ టాక్‌ : బాహుబలి పిజ్జాతో బుట్టబొమ్మ
X

హీరోయిన్‌ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్‌ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందమైన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు తన డైలీ లైఫ్ కు సంబంధించిన విషయాలను, ఫోటోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.


తాజాగా ఈ అమ్మడు వరల్డ్‌ పిజ్జా డే సందర్భంగా బాహుబలి సైజ్ పిజ్జా తో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. సాధారణం సెలబ్రెటీలకు పిజ్జాలు అంటే అమితమైన ఆసక్తి, ఇష్టం ఉండటం మనం చూస్తూనే ఉంటాం. బరువు పెరుగుతామనే భయం కారణంగా కాస్త తక్కువ తింటారు కానీ, వారు పిజ్జాలను అమితంగా ఆస్వాదిస్తారు.


ఆ జాబితాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా ఉంటుందని నిరూపితం అయ్యింది. ఈ ప్రత్యేక రోజు సందర్భంగా పూజా హెగ్డే అతి పెద్ద పిజ్జా తో ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం ద్వారా తనకు పిజ్జా పై ఉన్న ఆసక్తిని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేసిన ఈ అమ్మడు కాస్త స్లో అయ్యింది. ప్రస్తుతానికి చేతిలో సినిమాలు ఏమీ లేవు. కాని ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.