పెళ్లయాక అబ్బాయిని అయితే ఇలా అడుగుతారా?
కాలం మారిందని, ఇప్పుడు ప్రజలు ఏది ధరించాలనుకుంటే అది ధరించవచ్చని వ్యాఖ్యానించింది.
By: Tupaki Desk | 21 March 2024 2:46 PM GMTరకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన మహిళ కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ గా దుస్తులు ధరించాలని ఆమె కుటుంబ సభ్యులు (అత్త తరపున) భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. రకుల్ ప్రీత్ సింగ్ ఘాటైన సమాధానం ఇచ్చింది. కాలం మారిందని, ఇప్పుడు ప్రజలు ఏది ధరించాలనుకుంటే అది ధరించవచ్చని వ్యాఖ్యానించింది.
ఫిబ్రవరి 21న జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 సందర్భంగా వివాహానంతర జీవితం గురించి జాతీయ మీడియాతో మాట్లాడింది.
తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లను మార్చాలని ఫ్యామిలీలో ఎవరి నుంచైనా ఒత్తిడి ఎదురైందా? పెళ్లయాక అత్తారింట్లో కండీషన్స్ పెట్టారా? అని రకుల్ ని ప్రశ్నించగా దానికి తనదైన శైలిలో స్పందించింది.
నేను ఇరువైపులా కుటుంబాల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నాను. భారతీయ సమాజంలో మనం వివాహం గురించి పెద్ద ఒప్పంద ప్రమాణాలు చేసుకుంటామని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరి జీవితంలోనైనా సహజమైన ప్రక్రియ. మీరు పెళ్లి తర్వాత ఒక వ్యక్తిని ఫలానా విధంగా దుస్తులు ధరించమని అడుగుతారా? ఆఫీసుకు అత్యంత మెరిసే దుస్తులను ధరించండి అనగలరా? ఆ హక్కు లేదు ఎవరికీ.. కాలం మారింది.. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినది చేస్తారు... అని రకుల్ వివరణ ఇచ్చింది.
మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన రకుల్, జాకీల పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల జాబితాలో షాహిద్ కపూర్- మీరా కపూర్, భూమి పెడ్నేకర్ తదితరులు ఉన్నారు. జాకీ- రకుల్ జంట పెళ్లయి నెలరోజులైంది. ఈ సందర్భంగా ఈ జంట సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. అజయ్ దేవగన్, నీనా గుప్తా, నయనతార, సిద్ధార్థ్, అలియా భట్ వంటి పలువురు బాలీవుడ్ సహోద్యోగులు, స్నేహితులు నూతన వధూవరులకు బిగ్ డే శుభాకాంక్షలు తెలిపారు.