రైటర్ కు రూ.2 కోట్లు.. సినిమా రిజల్ట్ మాత్రం ప్చ్!!
ఏ సినిమాకు అయినా కథే మెయిన్ పిల్లర్. అది సరిగ్గా ఉంటేనే ప్రేక్షకులను మూవీ ఆకట్టుకుంటుంది.
By: Tupaki Desk | 28 Feb 2025 12:30 AM GMTఏ సినిమాకు అయినా కథే మెయిన్ పిల్లర్. అది సరిగ్గా ఉంటేనే ప్రేక్షకులను మూవీ ఆకట్టుకుంటుంది. కథలో బలం లేకపోయినా.. కొత్తదనం లేకపోయినా.. ఎంతటి సినిమా అయినా బోల్తా పడిపోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ.. కథపైనే మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇలా ఇప్పటికే చాలా సార్లు జరిగిన విషయం తెలిసిందే.
అదే సమయంలో కథలు అందించే రచయితకు ఫుల్ క్రేజ్ ఉంటే చాలు.. భారీ రెమ్యునరేషన్ అందుకుంటారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. సదరు రచయితకు పెద్ద మొత్తంలో అందుతుంది. రీసెంట్ గా ఓ రైటర్ విషయంలో అదే జరిగింది.
టెలివిజన్ కామెడీ షో బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అతనికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే స్టోరీస్ అందించిన పలు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
అలా ఓ డైరెక్టర్- సదరు రచయితకు సూపర్ హిట్ కాంబినేషన్ గా టాలీవుడ్ లో పేరు వచ్చింది. దీంతో కాంబో తాజాగా రిపీట్ అయింది. మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆడియన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకోగా.. వాటిని ఆ సినిమా అందుకోలేదని చెప్పవచ్చు.
ముఖ్యంగా సినిమా కథలో ఒకే ఒక్క పాయింట్ తప్ప కొత్తదనం కనిపించలేదని అనేక మంది రివ్యూస్ ఇచ్చారు. సినిమా కథ, కథనం అంతా ఊహకు అందే విధంగానే సాగిందని తెలిపారు. సస్పెన్స్ క్రియేట్ అవ్వలేదని అన్నారు. నేచురాలిటీ మిస్ అయిందని, రచన పరంగా ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేదిని అభిప్రాయపడ్డారు.
అలా కథ సరిగ్గా లేదని అనేక మంది రివ్యూస్ ఇచ్చారుగా.. కానీ ఆ రచయితకు రెమ్యునరేషన్ రూ.2.5 కోట్లు ఇచ్చారని వినికిడి. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత భారీ మొత్తంలో ఇచ్చిన పారితోషికానికి.. అందించిన స్టోరీకి ఏం సంబంధం లేదని కామెంట్లు పెడుతున్నారు. అంతెందుకు ఇచ్చారో ఆ స్టోరీకి అని అంటున్నారు.
ఇంకో పెద్ద విషయమేమిటంటే.. ఆ స్టోరీ రాయడానికి సదరు రచయితకు మరికొందరు రైటర్స్ కూడా సహాయం చేశారట. ఆరుగురు తలో చేయి వేశారన్నమాట. కానీ సినిమా కథలో చాలా మైనస్ లు ఉన్నాయి. రిలీజ్ కు ముందు కథ విషయంలో వివాదం తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఏదేమైనా డిమాండ్ ఉన్న రైటర్ కు మేకర్స్ రూ.2.5 కోట్లు ఇవ్వగా.. రిజల్ట్ మాత్రం ప్చ్ అన్నట్లు అయింది.