అన్నయ్య కోసం అదిరిపోయే స్టోరీ రాస్తా!
స్టార్ రైటర్ గా రాణించిన చిన్ని కృష్ణ ఇండస్ట్రీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 26 Aug 2024 9:49 AM GMTస్టార్ రైటర్ గా రాణించిన చిన్ని కృష్ణ ఇండస్ట్రీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ స్టోరీలు రాసిన రచయిత చిన్నకృష్ణ. ఇండస్ట్రీకి రికార్డులు రావాలన్నా? వాటిని బద్దలు కొట్టాలన్నా ఒకప్పుడు అందరికీ కనిపించే రైటర్ ఆయన. కాలక్రమంలో చిన్నకృష్ణ హవా తగ్గింది. కొత్త రైటర్లు రావడం...ట్రెండ్ మారడంతో రేసులో వెనుకబడ్డారు.
ఆ తర్వాత కొంత కాలానికి మెగాస్టార్ అభిమానులు నొచ్చుకునేలా చిన్నికృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప దం కావడంతో ఆయన పేరు కనుమరుగైంది. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవుగా. మంచి ...చెడు రెండూ ఉంటాయి. చెడును దాటి మళ్లీ చిన్ని కృష్ణ మంచి అనే రోజుల్లోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఎవరో ప్రోత్భబలం వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. క్షమించు అన్నయ్యా అంటూ మళ్లీ చిరంజీవి చెంత చేరారు.
చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంలో కలిసి విషెస్ తెలియజేసారు. చిరంజీవి బర్త్ డే కానుకగా `ఇంద్ర` రీ-రిలీజ్ అయిన సందర్భంగానూ చిరుని కలిసారు. ఇంత పాజిటివిటీ చిరంజీవి ఎందుకు కాదంటారు? సహజంగా ఎలాంటి కల్మశం లేని వ్యక్తిత్వం చిరంజీవిది. బద్ద శత్రువుల్ని సైతం క్షమించే గొప్ప గుణం ఉన్న నటుడు చిరంజీవి. ఈ సందర్భంగానే చిరంజీవి కోసం ఏవైనా కథలు రాస్తే చెప్పు అని చిరంజీవి అనురాగం కురిపించారు.
దీంతో చిన్నికృష్ణలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈసారి అన్నయ్యకి రాస్తే గనుక చరిత్రలో నిలిచిపోయే కథ రాస్తానని, బాక్సాఫీస్ షేక్ అయ్యేలా ఆ స్టోరీ ఉంటుందన్నారు. మరి ఇప్పుడు చిన్నికృష్ణ అలాంటి కథ రాయగలరా? ఎంతో మంది కొత్త రైటర్లు ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నారు. వాళ్ల నుంచి పోటీని తట్టుకుని ట్రెండ్ కి తగ్గట్టు తనదైన మార్క్ స్టోరీ ఇవ్వగలరా? అన్నది చూడాలి.