Begin typing your search above and press return to search.

సైంధవ్ రాంగ్ యుసేజ్.. వెంకీ నయా స్టైల్

రీసెంట్గా సినిమాలోని రాంగ్ యూసేజ్ అనే ఒక పాటను విడుదల చేశారు. అందులో మందు తాగుతూ బాధపడకూడదు అని సంతోషాన్ని డబుల్ చేయాలి అనే విధంగా వెంకటేష్ జీవిత సత్యాన్ని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:15 PM GMT
సైంధవ్ రాంగ్ యుసేజ్.. వెంకీ నయా స్టైల్
X

విక్టరీ వెంకటేష్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న డిఫరెంట్ యాక్షన్ మూవీ సైంధవ్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాను మొదట డిసెంబర్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా మళ్లీ సంక్రాంతికి షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. హిట్ సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా టీజర్ కూడా ఇదివరకే విడుదలైంది.

ఇక విడుదలైన పోస్టర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో డాటర్ ఎమోషన్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు బలంగా కనెక్ట్ అవుతుంది అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక సినిమాకు సంబంధించిన సాంగ్స్ ను కూడా మెల్లమెల్లగా విడుదల చేస్తున్నారు.

రీసెంట్గా సినిమాలోని రాంగ్ యూసేజ్ అనే ఒక పాటను విడుదల చేశారు. అందులో మందు తాగుతూ బాధపడకూడదు అని సంతోషాన్ని డబుల్ చేయాలి అనే విధంగా వెంకటేష్ జీవిత సత్యాన్ని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో అయితే వెంకటేష్ స్టెప్పులు కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వెంకీ ఒక డిఫరెంట్ లుక్ తో ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాడు. నకాశ్ ఆజీజ్ పాడిన ఈ పాటను సంతోష్ నారాయణన్ సరపరచగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

ఇక ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఏ తరహాలో ఉంటుందో టీజర్ ద్వారానే ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా వెంకటేష్ డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకోబోతున్నాడు అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా తో పాటు సంక్రాంతికి పోటీగా మరో ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, ఫ్యామిలీ స్టార్, నా సామి రంగ సినిమాలపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

అయినప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో అయితే సైంధవ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొదట ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదు అని కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. పోటీ నుంచి తప్పుకుంటూ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నారని కూడా కథనాలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తోంది. మరి ఈ పోటీలో సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.