Begin typing your search above and press return to search.

'యారియాన్ 2' ట్రైలర్: ఆ ఎమోష‌న్స్ ఏమ‌య్యాయి?

ఆ ముగ్గురి ప్రేమ‌క‌థ‌ల్లో ఉన్న ట్విస్టులేమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. తాజాగా రిలీజైన 'యారియన్ 2' ట్రైల‌ర్ చూడ‌గానే ముగ్గురి చుట్టూ తిరిగే ఆస‌క్తిక‌ర సినిమా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:07 PM GMT
యారియాన్ 2 ట్రైలర్: ఆ ఎమోష‌న్స్ ఏమ‌య్యాయి?
X

ఒక అంద‌మైన అమ్మాయి.. ఆ అమ్మాయి జీవితంలో ఇద్ద‌రు అబ్బాయిలు! ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు స్నేహితులు అయితే ఆ త‌ర్వాత స్టోరీలో మ‌జా ఏమిట‌న్న‌దే ఈ ట్రైల‌ర్ థీమ్. ఆ ముగ్గురి ప్రేమ‌క‌థ‌ల్లో ఉన్న ట్విస్టులేమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. తాజాగా రిలీజైన 'యారియన్ 2' ట్రైల‌ర్ చూడ‌గానే ముగ్గురి చుట్టూ తిరిగే ఆస‌క్తిక‌ర సినిమా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ ఆద్యంతం క‌ల‌ర్ ఫుల్ విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నా కానీ, ఈ సినిమా బెంగ‌ళూరు డేస్ పోలిక‌ల‌తో క‌నిపించ‌డంతో .. ఆ స్థాయిలో ఈ రీమేక్ అల‌రిస్తుందా? అంటూ డిబేట్లు స్టార్ట‌య్యాయి. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ మాతృక‌కు ధీటుగా లేద‌నేది అభిమానుల వాద‌న‌.

నిజానికి బెంగ‌ళూరు డేస్ (క‌న్న‌డ సినిమా) క‌థ‌లో ఎమోష‌న్స్ టింజ్ మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుట‌య్యాయి. కానీ అంత సీన్ తాజాగా యారియాన్ 2 ట్రైల‌ర్ లో క‌నిపించ‌డం లేదు. ఈ ట్రైల‌ర్ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేదు. అంజలి మీనన్ ఒరిజినల్ గా బెంగ‌ళూర్ డేస్ కి దర్శకత్వం వహించారు. తమిళంలో పేరు మార్పుతో విడుద‌లైంది. కానీ ఇప్పుడు హిందీలో అదే సినిమా స్ఫూర్తితో యారియాన్ 2 వ‌స్తోంది. అయితే ఇది ఏమేర‌కు యూత్ ని థియేట‌ర్ల‌కు రప్పిస్తుందో వేచి చూడాలి.

యారియాన్ 2 లో దివ్య ఖోస్లా కుమార్, మీజాన్ జాఫ్రీ, యష్ దాస్‌గుప్తా నటించారు, వీరు మొదట ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్, దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రల్లో న‌టించారు. రాధికా రావు, వినయ్ సప్రు దర్శకత్వంలో యారియన్ 2 రూపొందుతోంది. చిత్రం విడుదల అక్టోబర్ 10 న విడుద‌ల కానుంది.

ఆ ముగ్గురి ప్రేమ‌క‌థ‌ల్లో ట్విస్టు..

యారియాన్ 2 ట్రైలర్ లో త్యాగం నిజాన్ని దాచడానికి ప్ర‌య‌త్నించే డైలాగ్ లు ఆస‌క్తిక‌ర‌మే. నువ్వు త్యాగం చేసి నిజాన్ని దాచిపెట్టాలి కాబట్టి కిసి కో బుర నా లాగే. కయీ బార్ ఏక్ దోస్త్ కి కహీ చీజ్ దుస్రే దోస్త్ కో నహీ కహీ జాతి, అందుకే దుస్రే దోస్త్ కో బురా నా లాగే (ఎవరూ బాధపడకూడదు. చాలా సార్లు, ఒక స్నేహితుడు మీకు ఏదైనా చెబితే మేం దానిని ఇత‌రుల‌తో షేర్ చేయ‌ము. అతను/ఆమె చెడుగా భావించకుండా ఉండటానికి.. అంటూ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంది. యారియాన్ 2 ట్రైలర్ దివ్య పాత్ర లాడ్లీని పరిచయం చేయడం ద్వారా ప్రారంభమవుతుంది. యష్ దాస్‌గుప్తా డేరింగ్ క్యారెక్టర్, శిఖర్ ,పెరల్ వి పూరి అంకితభావంతో కూడిన పాత్ర ట్రైల‌ర్ లో ప్ర‌ద‌ర్శించారు. ట్రైలర్ ఈ ముగ్గురు దాయాదుల సంక్లిష్టమైన శృంగార జీవితాలు ..వారి సన్నిహిత సంబంధాలకు సంబంధించిన విష‌యాల‌తో ర‌న్ అవుతుంది. లాడ్లీ పెళ్లికి రెడీ కాగా, అనంత‌రం సంక్లిష్టతలు ఏమిట‌న్న‌దే సినిమా. ట్రైలర్ హార్ట్‌బ్రేక్, పెయిన్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్, డ్రామాతో నిండిన మూడు క్లిష్టమైన ప్రేమ కథలను ఎలివేట్ చేస్తోంది. 'యారియన్ 2' ఆశించిన విజ‌యం అందుకుంటుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.