ఆస్కార్స్ 2024: ఫేక్ అవార్డ్స్ షో అనేసిందే
ఇక్కడ అవార్డుల ప్రహసనం అంతా ఫేక్ అని పరోక్షంగా విమర్శించింది. తాను అవార్డు షోలకు ఎందుకు హాజరు కావడం మానేసిందో కూడా యామి వెల్లడించింది.
By: Tupaki Desk | 11 March 2024 10:25 AM GMTప్రస్తుతం తన తాజా చిత్రం 'ఆర్టికల్ 370'లో అత్యుత్తమ నటప్రదర్శనకు ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఆస్కార్ అవార్డులు ఫేక్ అంటూ వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఓపెన్‌హీమర్ ఫేం సిలియన్ మర్ఫీని ప్రశంసించిన యామి ఉత్తమ నటుడిగా అకాడెమీ పురస్కారం గెలుచుకోవడాన్ని అభినందించింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డులలో క్రిస్టోఫర్ నోలన్ - ఓపెన్‌హైమర్‌లో నటనకుగాను సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు.
ఈరోజు పురస్కారాల ప్రకటన వేళ యామి తన అధికారిక X ఖాతాలో సిలియన్ మర్ఫీని ప్రశంసించింది. అతడు అతి పెద్ద గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో సత్కారం అందుకోవడం చూస్తుంటే చివరికి మీ ప్రతిభే అన్నింటికంటే ఉన్నతంగా నిలిచిందని మాకు తెలిసింది... అభినందనలు! అంటూ సిలియన్ మర్ఫీని యామి ట్యాగ్ చేసింది. అయితే అదే పోస్ట్‌లో ఇండియన్ ఫిల్మ్ అవార్డులను తీవ్రంగా విమర్శించింది. ఇక్కడ అవార్డుల ప్రహసనం అంతా ఫేక్ అని పరోక్షంగా విమర్శించింది. తాను అవార్డు షోలకు ఎందుకు హాజరు కావడం మానేసిందో కూడా యామి వెల్లడించింది.
ప్రస్తుత ఫేక్ 'ఫిల్మీ' అవార్డులపై నమ్మకం లేకపోవడంతో గత కొన్నేళ్లుగా నేను వాటికి హాజరుకావడం మానేశాను.. కానీ ఈ రోజు నేను గొప్ప ఓర్పు, భావోద్వేగాలకు నిలబడే ఒక అసాధారణ నటుడికి పురస్కారం రావడం చూసి నిజంగా సంతోషంగా ఉన్నాను అని యామి చెప్పింది. ఆస్కార్స్ 2024లో ఓపెన్‌హైమర్ 7 అకాడమీ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి.