తరుణ్ హీరోయిన్ మొదటి ఫ్రెగ్నెన్సీ
తెలుగులో తరుణ్ సరసన 'యుద్ధం' సినిమాలో నటించింది యామి గౌతమ్. ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి ఒక కీలక పాత్రను పోషించారు
By: Tupaki Desk | 8 Feb 2024 5:02 PM GMTతెలుగులో తరుణ్ సరసన 'యుద్ధం' సినిమాలో నటించింది యామి గౌతమ్. ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి ఒక కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత యామి తెలుగులో కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో 'విక్కీ డోనర్' లాంటి చిత్రంతో యామి పేరు మార్మోగింది. హృతిక్ సరసన కాబిల్ చిత్రంలో అంధురాలి పాత్రతోను యామి గౌతమ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఇచ్చింది.
వ్యక్తిగత జీవితంలోను యామి ఆనందకరమైన జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రముఖ దర్శకనిర్మాత ఆదిత్య ధర్ ని యామి వివాహం చేసుకుంది. చాలా కాలంగా ఈ జంట హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ప్రస్తుతం 'ఆర్టికల్ 370' మూవీ కోసం రెండవసారి కలిసి పని చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యామి గర్భవతి అని .. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని ఆధిత్యధర్ అధికారికంగా ధృవీకరించారు. తమ ఇంటికి వస్తున్నది లక్ష్మీనా లేక గణేషుడా అనేది త్వరలో తెలుస్తుందని ఆయన అన్నారు. తండ్రి కాబోతున్నందున ఆధిత్య ధర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ''ఇది అద్భుతమైన సమయం... ఎందుకంటే సినిమా తెరకెక్కిన విధానం.. అదే సమయంలో శిశువు జననం గురించి మేము తెలుసుకున్న విధానం.. నాకు అభిమన్యుడి కథను గుర్తు చేసిందని అనిపించింది. ఆర్టికల్ 370 ఎలా రద్దు అయిందో పుట్టబోతున్న మా పాపకు సరిగ్గా తెలుసు'' అని వ్యాఖ్యానించారు.
యామీ గౌతమ్ - ఆదిత్య ధర్ 2019 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం URI నిర్మాణ సమయంలో కలుసుకున్నారు. ఆ సినిమాలో యామికి అద్భుతమైన పాత్రలో అవకాశం కల్పించారు ఆధిత్యధర్. అటుపై సెట్స్ లో ఉన్నప్పుడే ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. 4 జూన్ 2021న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత యామి తన పేరును యామీ గౌతమ్ ధర్‌గా మార్చుకుంది.
ఆర్టికల్ 370 గురించి...
ఆర్టికల్ 370ని జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తగా నిర్మించారు. ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. ఇది URI తర్వాత ఆదిత్య - యామిలకు రెండో ప్రాజెక్ట్. 23 ఫిబ్రవరి 2024న థియేటర్లలో విడుదల కానుంది. జమ్మూ అండ్ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఎమోషనల్ జర్నీకి సంబంధించిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. యామీ ఇంతకుముందు అక్షయ్ కుమార్ - పంకజ్ త్రిపాఠిలతో కలిసి కామెడీ డ్రామా చిత్రం OMG 2లో కనిపించింది. దీనికి అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ OMG ఓహ్ మై గాడ్‌కి సీక్వెల్ చిత్రమిది. 'ఓ మైగాడ్' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కడమే గాక, కమర్షియల్ గాను ఘనవిజయం సాధించింది.