Begin typing your search above and press return to search.

ఇంటి కోసం వెళ్తే ముద్దుగుమ్మకి అవమానం!

ఇండస్ట్రీ వారిని నమ్మలేమని మొహాన్నే చెబుతూ ఉంటారని చాలా మంది తమ అనుభవాలను గతంలో చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   23 Jan 2025 6:51 AM GMT
ఇంటి కోసం వెళ్తే ముద్దుగుమ్మకి అవమానం!
X

సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంటే పర్వాలేదు... బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఆశ పడేవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో అందరికీ తెలిసిందే. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌, ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలి అనుకునే వారికి ఇళ్లు లభించడం పెద్ద సమస్యగా ఉంటుంది. చాలామంది సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నిస్తున్నాం అంటే కనీసం ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించరు. ఇండస్ట్రీ వారిని నమ్మలేమని మొహాన్నే చెబుతూ ఉంటారని చాలా మంది తమ అనుభవాలను గతంలో చెప్పుకొచ్చారు.


తాజాగా నటి డాక్టర్ యామిని మల్హోత్రా సైతం అదే ఇబ్బందిని ఎదుర్కొంటుంది. ఇటీవల ఈమె హిందీ బిగ్‌బాస్ సీజన్‌ 18లో పాల్గొంది. బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీ దక్కడంతో నటిగా మరింత సీరియస్‌గా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుంచి పూర్తిగా ముంబై షిప్ట్‌ కావాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె ఇల్లు కోసం వెతుకుతున్న క్రమంలో ఆమెకు తీవ్ర నిరాశ మిగిలింది. చాలా చోట్ల మతం అడిగి అవమానించడంతో పాటు కులం పేరుతో ఆమెను ప్రశ్నించారట. దాంతో తాను విసిగి పోయాను అంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ముంబైలో ఇళ్లు లభించడం చాలా కష్టంగా ఉందని ఆమె పేర్కొంది.

ఇల్లు కోసం అడిగితే చాలా మంది తన నేపథ్యం గురించి అడుగుతున్నారు. ఫ్యామిలీ వివరాలు మొదలుకుని హిందువా లేదా ముస్లిం మతమా అని అడుగుతున్నారు. ఒక నటిని అని చెప్పిన తర్వాత చాలా మంది ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. నటిగా ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ ఇండస్ట్రీ వారికి ఇచ్చే ఉద్దేశం లేదని అంటున్నారు. ముంబైలో ఇళ్లు లభించడం ఇంత కష్టం అని తాను భావించలేదని యామిని చెప్పుకొచ్చింది. తాను ఒక డాక్టర్‌ని అని చెప్పినా చాలా మంది కనీసం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకునే వారికి మాత్రం ఇళ్లు లభించడం ముంబైలోనే కాకుండా ఇతర ఏ మెట్రో నగరాల్లో అయినా చాలా కష్టంగా ఉందని సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఆమె పోస్ట్‌కి కామెంట్స్ చేస్తున్నారు. బయటి వ్యక్తులకు ఇళ్లు లభించడం అనేది చాలా పెద్ద విషయంగా మారింది. ఎంతో మంది తమ కలలను నెరవేర్చుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ వచ్చి రాగానే చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయని యామిని తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.