Begin typing your search above and press return to search.

08-08- ముహూర్తం ఖరారు

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాక్సిక్‌ సినిమా షూటింగ్ కు 08-08 ని ముహూర్తం గా ఖరారు చేయడం జరిగింది. యశ్ కి 08 నెంబర్‌ లక్కీ నెంబర్‌ అనే విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   7 Aug 2024 4:39 AM GMT
08-08- ముహూర్తం ఖరారు
X

కేజీఎఫ్‌ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ హీరోగా మారిన యశ్‌ తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018 లో కేజీఎఫ్‌ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశ్‌, 2022 లో కేజీఎఫ్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు దేశ వ్యాప్తంగా యశ్ కి స్టార్ ఇమేజ్ ని తెచ్చి పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా యశ్ తో సినిమాలకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించారు. కానీ యశ్ మాత్రం తదుపరి సినిమాకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. ఎన్నో కథలు విన్న యశ్‌ చివరకు విభిన్న చిత్రాలతో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ గా మంచి విజయాలను సొంతం చేసుకున్న గీతూ మోహన్ దాస్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. గీతూ మోహన్‌ దాస్‌ గత ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో బిజీగా ఉన్నారు.

యశ్‌, గీతూ మోహన్‌ కాంబో సినిమాకి టాక్సిక్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాక్సిక్‌ సినిమా షూటింగ్ కు 08-08 ని ముహూర్తం గా ఖరారు చేయడం జరిగింది. యశ్ కి 08 నెంబర్‌ లక్కీ నెంబర్‌ అనే విషయం తెల్సిందే. ఆ తేదీన సినిమాను ప్రారంభించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. ఈనెల 8న సినిమా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి అంటూ కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

టాక్సిక్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్న యశ్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. యశ్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఆసక్తి ఉంది. కనుక ఆ స్థాయిలోనే సినిమా ఉండే విధంగా కన్నడంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. యశ్ గత చిత్రం వెయ్యి కోట్ల వసూళ్లను నమోదు చేసింది కనుక టాక్సిక్‌ కూడా వెయ్యి కోట్లకు మించి వసూళ్లు చేసే విధంగా ఉండాలని అభిమానులు మరియు కన్నడ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో యశ్‌ కి జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కరీనా కపూర్‌ ఖాన్‌ నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరి కొందరి పేర్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా యశ్ సోదరి పాత్ర లో నయనతార కనిపించబోతుందని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటి వరకు సినిమాలో హీరోయిన్‌ విషయమై యూనిట్‌ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ కన్నడ మీడియాతో పాటు ఇతర మీడియా సంస్థల్లో మాత్రం రోజుకో వార్త అన్నట్లుగా వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ యశ్ కి జోడీ అనే ప్రచారం జరుగుతోంది.

టాక్సిక్‌ లో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందనే వార్తలు కూడా ఆ మధ్య వచ్చాయి. మొత్తానికి సినిమా ను ఈనెల 8న ప్రారంభించిన తర్వాత అన్ని విషయాలపై ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. యశ్‌ తో నటించేందుకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సైతం ఆసక్తి చూపుతున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్‌ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయనతో నటించేందుకు పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే యశ్‌, గీతూ మోహన్ ల నిర్ణయం ఏంటి అనేది చూడాలి.