ఆ మూడు సినిమాలతో యష్ గేమ్ ఛేంజ్?
కేజీఎఫ్ ఫ్రాంచైజీ అపూర్వమైన విజయం యష్ కెరీర్‌ను మార్చడమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలోనే గర్వం, ఆశయాన్ని నింపింది.
By: Tupaki Desk | 24 Feb 2025 3:36 AM GMTరొటీనిటీని బ్రేక్ చేయడమే హీరోయిజం ఈరోజుల్లో. అలాంటి రొటీనిటీని బ్రేక్ చేసాడు కాబట్టే ప్రభాస్ ని ప్రపంచం గుర్తుంచుకుంది. అతడిని పాన్ ఇండియన్ స్టార్ ని చేసి నెత్తిన పెట్టుకున్నారు జనం. కన్నడ ఇండస్ట్రీ నుంచి యష్ అలాంటి గుర్తింపు సంపాదించాడు. బాలీవుడ్ టాలీవుడ్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలు సాధించిన ఘనవిజయాలు సర్వత్రా ఆసక్తిని పెంచాయి. ఒకే ఒక్క కేజీఎఫ్ కన్నడ సినిమా గురించి జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేసింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ అపూర్వమైన విజయం యష్ కెరీర్‌ను మార్చడమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలోనే గర్వం, ఆశయాన్ని నింపింది.
2018లో 'కేజీఎఫ్ : చాప్టర్ 1' విడుదలైన తర్వాత యష్ పాన్-ఇండియా స్టార్ గా ఆవిర్భవించాడు. అతడు తన నటనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీకి అతి పెద్ద పాన్ ఇండియన్ ఆశా ద్వీపంగా కనిపించాడు. జాతీయ వేదికపై అంతగా గుర్తింపు లేని కన్నడ ఇండస్ట్రీకి రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ వల్ల గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. ఈ కీర్తిని మరింత ఎత్తులకు చేర్చడానికి యష్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాడు.
కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 తర్వాతా యష్ తెలివైన అడుగులు వేస్తున్నాడు. అతడు టాక్సిక్, రామాయణం లాంటి వైవిధ్యమైన సినిమాలను ఎంపిక చేసుకున్నాడు. కేజీఎఫ్ తో వచ్చిన సూపర్‌స్టార్‌డమ్ ను కిందికి లాక్కెళ్లే ప్రాజెక్టులను అతడు ఎంపిక చేయలేదని ఈ లైనప్ చెబుతోంది. అతడు నటిస్తున్న టాక్సిక్, రామాయణం ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రాల జాబితాలో ఉన్నాయి.
టాక్సిక్, రామాయణం తర్వాత కేజీఎఫ్ 3 కోసం ప్రణాళికలు రచిస్తున్నాడు. యష్ బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా కొత్త సినిమా అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాడు. అతడి ఎంపికలు ప్రత్యేకమైనవి. భారతీయ సినిమా పరిధులను విస్తరింపజేసే ఆలోచనలు యష్ కు ఉన్నాయి. బాక్సాఫీస్ గణాంకాలకు మించి, అతని ప్రయాణం అభిరుచి, పట్టుదల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. యష్ భవిష్యత్ లో రాజమౌళి, లక్ష్మణ్ ఉటేకర్ (చావా, యూరి చిత్రాల దర్శకుడు) వంటి దర్శకులతో పని చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. సరిహద్దులు దాటి ప్రణాళికల్ని విస్తరించడం ఎలానో యష్‌కు తెలుసు. అందుకే అతడి భవిష్యత్ ప్రాజెక్టులపై భారీ అంచనాలేర్పడుతున్నాయి.