డిసెంబర్ నుంచి రంగంలోకి రావణుడు!
బాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా `రామాయణ్` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Sep 2024 6:21 AM GMTబాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా `రామాయణ్` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్.. సీత పాత్రలో సాయి పల్లవి...రావణుడి పాత్రలో యశ్..హనుమంతుడి పాత్రలో సన్నిడియోల్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెరకెక్కిస్తున్నారు. కుంభకర్ణుడి పాత్రలో బాబి డియోల్ని ఎంపిక చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇంకా రామాయణంలో ఉన్న కీలక పాత్రలకు చాలా మంది ప్రముఖల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే రాముడు, సీత పాత్రలకు సంబంధించిన చాలా సన్నివేశాలు పూర్తి చేసారు. ఇంకా లందకాధిపతి యశ్ జాయిన్ కాలేదు. అతి త్వరలోనే యశ్ కూడా సెట్స్ కి వెళ్లనున్నాడు. తాజాగా యశ్ సెట్స్ కి వెళ్లే డేట్ కూడా ఫిక్స్ అయింది. డిసెంబర్ నుంచి యశ్ షూట్ లో జాయిన్ అవుతాడని సమాచారం. టాక్సిక్ తో డేట్లు క్లాష్ అవ్వకుండా? రామాయణ్ కి డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇక రావణుడి పాత్రకి సంబంధించి నితీష్ తివారీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రావణుడి పాత్రకు సంబంధించి పూర్తిగా నిజమైన భంగారు ఆభరణాలే వినియోగిస్తున్నారు. నేచురల్ లుక్ రావాలంటే సహజమైన మేలిమి బంగారంతోనే సాధ్యమవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆభరణాలు అన్నింటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. మార్కెట్ లో దొరికే ఆభరణా లకంటే తయారు చేయిస్తే మరింత వైభవంగా ఆ పాత్రని హైలైట్ చేయడానికి సహాయప డుతుందని టీమ్ భావిస్తుంది.
ఇక్కడ మరో బలమైన కారణంగా కూడా తెరపైకి వస్తోంది. రావణుడు లంకాధిపతి. లంక అంతా బంగారం తో నిర్మితమై ఉంటుందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. అందమైన లంక సిద్దమవ్వవాలన్నా? ఆపాత్రలో నటించే నటుడికి సహజ రూపం రావాలన్నా ఒరిజినల్ బంగారంతోనే సాధ్యం అని..బడ్జెట్ ఎక్కువైనా ఎక్కడా రాజీ పడొద్దని యూనిట్ ని ఆదేశించినట్లు సమాచారం.