యశ్ న్యూ లుక్ ఫ్యాన్స్ లో పూనకాలే కానీ!
తాజాగా యశ్ సహా టీమ్ అంతా స్పాట్ లో మీడియా కెమెరాకి చిక్కారు ఇందులో యశ్ న్యూలుక్ అదిరిపోయింది.
By: Tupaki Desk | 11 Nov 2024 6:31 AM GMTపాన్ ఇండియా స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో `టాక్సిక్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదీ `కేజీఎఫ్` తరహాలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నే రంగంలోకి దించారు. `జాన్ విక్`, `జాంగో అన్చైన్డ్`, `ఎక్స్-మెన్`,` డేర్‌డెవిల్,` ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్`, `డైవర్జెంట్`, `డే షిఫ్ట్`లాంటి చిత్రాలకు స్టంట్ మాస్టర్ గా పనిచేసిన ఫ్రఖ్యాత జెజె పెర్రీని రంగంలోకి దించారు.
తదుపరి భారీ యాక్షన్ షెడ్యూల్ వెర్సోవా జెట్టీలో ప్లాన్ చేసారు. తాజాగా యశ్ సహా టీమ్ అంతా స్పాట్ లో మీడియా కెమెరాకి చిక్కారు. ఇందులో యశ్ న్యూలుక్ అదిరిపోయింది. స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. యశ్ హెయిర్ స్టైల్ గత చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంది. పక్క పాపిడి దువ్వాడు. కళ్లని మాత్రం నల్లటి అద్దాలతో కవర్ చేసాడు. ఇక గెడ్డం లుక్ లీక్ అవ్వకుండా తగు జాగ్రత్త తీసుకున్నాడు. గెడ్డానికి సహా ముక్కు వరకూ నల్లటి స్కాప్ ధరించాడు.
దీంతో గెడ్డం లుక్ లో ఎక్కడా లీక్ అవ్వలేదు. అప్పుడే లుక్ రివీల్ చేస్తే కిక్కు పొద్దని ఈ విధంగా ప్లాన్ చేసారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ నగరంలోని ఒక ద్వీపంలో జరుగుతుంది. ఇటీవల జెజె పెర్రీ ముంబైలో `టాక్సిక్` సెట్స్‌లో కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి యశ్ జె.జె పర్యవేక్షణలో కొంత శిక్షణ కూడా తీసుకున్నాడు.
మార్షల్ ఆర్స్ట్ కి సంబంధించి ఆ ట్రైనింగ్ జరిగిందని సమాచారం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో షూటింగ్ అంటే ఆషామాషీ గా ఉండదు. రియలిస్టిక్ అప్పిరియన్స్ కావాలంటే? సన్నివేశాల కోసం అంతే విధంగా శ్రమించాల్సి ఉంటుంది. `కేజీఎఫ్` ని మించి ఈ చిత్రాన్ని ప్లాన్ చేయడంతో అంతకు మించే యశ్ కూడా కష్టపడాల్సి వస్తోంది.