Begin typing your search above and press return to search.

యష్ vs ప్రభాస్ క్లాష్ తప్పదా?

నెక్స్ట్ ప్రభాస్ నుంచి ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

By:  Tupaki Desk   |   29 July 2024 1:30 PM GMT
యష్ vs ప్రభాస్ క్లాష్ తప్పదా?
X

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకొని దేశంలోనే అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరోగా అవతరించాడు. ఈ మూవీ సక్సెస్ తో ప్రభాస్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఆయన అప్ కమింగ్ సినిమాల బిజినెస్ లని కూడా డిసైడ్ చేయనుంది. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

మారుతి దర్శకత్వంలో 250 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హర్రర్ కామెడీ జోనర్ లో హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని మారుతి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందంట. అఫీషియల్ గా అయితే డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్ తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత మరల కేజీఎఫ్ స్టాండర్డ్స్ ని బీట్ చేసే రేంజ్ లో కథ ఉండాలని యష్ చాలా సమయం తీసుకున్నారు. ఫైనల్ గా టాక్సిక్ అనే చిత్రాన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ మొదలైంది. 10 ఏప్రిల్ 2025న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ వేగంగా కంప్లీట్ చేసుకుని ఆ డేట్ కి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

అదే జరిగితే డార్లింగ్ ప్రభాస్, రాకింగ్ స్టార్ యష్ మధ్య క్లాష్ తప్పదనే ప్రచారం నడుస్తోంది. ది రాజా సాబ్ చిత్రాన్ని కూడా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చే విధంగా రిలీజ్ డేట్ ని ప్లాన్ చేస్తున్నారు. మాగ్జిమమ్ ఒకే డేట్ కి, లేదంటే వారం రెండు వారాల గ్యాప్ లో ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంట. స్టార్ డమ్ పరంగా ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

అయితే ప్రభాస్ యష్ కంటే కాస్త ఎక్కువ మార్కెట్ వాల్యూ కలిగి ఉన్నారు. టాక్సిక్, ది రాజా సాబ్ సినిమాలు పోటీ పడితే యష్ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రభాస్ సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్న కూడా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. దీనికి కారణం సలార్ ఇంపాక్ట్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్, యష్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.