'రామాయణం' పైనే ఎందుకు మనసుపడ్డాడు?
యష్ ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు సహ-నిర్మాతగా చేయాలనుకుంటున్నాడో వెరైటీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపాడు
By: Tupaki Desk | 13 April 2024 5:16 AM GMTరాకింగ్ స్టార్ యష్ అకస్మాత్తుగా 'రామాయణం'కి సహనిర్మాతగా మారాడు. తాను రామాయణం లాంటి పురాణేతిహాస కథకు బాగా కనెక్టయి ఉన్నానని, ప్రజలకు ఇలాంటి కథల్ని డెప్త్ తో చూపించాలని భావించానని సహనిర్మాత హోదాలో యష్ వ్యాఖ్యానించారు. అతడు ఆస్కార్ విన్నింగ్ పాపులర్ వీఎఫ్ఎక్స్ కంపెనీ యజమాని అయిన నమిత్ మల్హోత్రాతో కలిసి నితీష్ తివారీ రామాయణం చిత్రానికి సహనిర్మాతగా మారినట్టు నిన్ననే ప్రకటించారు.
అయితే యష్ ఇంత సడెన్ గా ఈ పురాణేతిహాసంపై అంత పెద్ద ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటూ గుసగుస మొదలైంది. ఇంతకుముందు ప్రభాస్- ఓంరౌత్ ఆదిపురుష్ లాంటి భారీ ప్రయత్నం చేస్తున్న క్రమంలోను యష్ తనకు రామాయణంలో నటించాలనుందనే విషయాన్ని బయటపెట్టలేదు. కానీ ఆదిపురుష్ ఫ్లాపయ్యాక, నితీష్ రామాయణంలో చోటు దక్కాక.. ఇప్పుడు యష్ ఈ పురాణేతిహాస కథతో రామాయణం సినిమాలో నటించాలని భావిస్తున్నట్టు తెలిపాడు. భారతీయ పురాణేతిహాసాన్ని ప్రపంచ వేదికపై ఉంచడమే తన లక్ష్యమని అన్నాడు.
నితీష్ తివారీ రామాయణం కోసం.. తాను ఎందుకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాననే విషయంపై యష్ ఇప్పుడు చెప్పిన విషయం నిజంగానే ఆసక్తిని కలిగించింది. ఇలాంటి భారీ చిత్రాన్ని తీయాలంటే బడ్జెట్లు సమకూర్చడం చిన్న విషయం కాదు. అందుకే చాలా కాలంగా వేచి చూసి ఇప్పుడు ప్రయత్నిస్తున్నామని కూడా యష్ అన్నారు. యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ ని నితీష్ రామాయణం కోసం ఇన్వాల్వ్ చేసాడు. యష్ ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు సహ-నిర్మాతగా చేయాలనుకుంటున్నాడో వెరైటీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపాడు.
రామాయణాన్ని ప్రపంచంతో పంచుకోవాలని: రామాయణం గురించి మనందరికి బాగా తెలుసు. అయినా ఇంకా ఇంకా తెలుసుకునేందుకు దానిలో చాలా ఉంది. అందుకే లోతైన పరిజ్ఞానంతో ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని అందించాలని అనుకున్నాను అని యష్ అన్నారు. రామాయణంతో నేను ఘాడంగా కనెక్టయ్యి ఉన్నానని కూడా తెలిపాడు. ప్రజాసమూహానికి నచ్చేలా ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్ మెచ్చేలా ఒక గొప్ప దృశ్యకావ్యాన్ని నేను అందించాలనుకుంటున్నాను అని కూడా యష్ అన్నారు. యష్ ప్రత్యేకించి రామాయణంపైనే ఎందుకు ఫోకస్ చేసాడు? అంటే దానికి కారణం ఈ సబ్జెక్ట్ కి ఉన్న యూనివర్శల్ కనెక్టివిటీ అని అంగీకరించాలి. ఇది వర్కవుట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నిటా సినిమాని ఆడించవచ్చు. వరల్డ్ వైడ్ మార్కెట్ ని గ్రాబ్ చేయొచ్చనేది యష్ ఆలోచన. సరైన సమయంలో సరైన కాన్సెప్టుపై ఒక నిర్మాతగా పెట్టుబడులు పెట్టేందుకు యష్ తన సంపదల్ని సద్వినియోగపరుస్తున్నాడని భావించాలి.
రామనవమికి ప్రకటిస్తారా?
నిజానికి నితేష్ తివారీ రామాయణంలో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడని ఇంతవరకూ ప్రకటించనే లేదు. మేకర్స్ ఇంకా ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో తారాగణం, టెక్నీషియన్ల గురించి కూడా వెల్లడించలేదు. అయితే ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. రణబీర్ ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం శిక్షణను ప్రారంభించాడు. వర్కవుట్లు చేసి యానిమల్ కోసం పెరిగిన బరువు తగ్గడంపై దృష్టి సారించాడు. త్వరలోనే సెట్స్ కి వెళతాడు.
రామాయణం సెట్స్ నుండి లారా దత్తా, అరుణ్ గోవిల్ చిత్రాలు ఇటీవల లీక్ అయ్యాయి. తాజా సమాచారం మేరకు.. సంగీత స్వరకర్తలు AR రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారని తెలిసింది. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున చిత్ర బృందం అధికారికంగా ఈ మూవీని ప్రకటించే అవకాశం ఉంది.