Begin typing your search above and press return to search.

డ్యాన్స్ మాస్టర్ల హీరోయిజం.. రంగంలోకి మరొకరు!

కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన యశ్ మాస్టర్ కూడా హీరోగా తన లక్ ని పరీక్షించుకుంటున్నారు

By:  Tupaki Desk   |   24 July 2023 6:27 AM GMT
డ్యాన్స్ మాస్టర్ల హీరోయిజం.. రంగంలోకి మరొకరు!
X

సినిమా హీరోలు ఇవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే, హీరోగా క్లిక్ అవ్వాలి అంటే కేవలం నటించడం వస్తే సరిపోదు. వారికి డ్యాన్స్ చేయడం కూడా రావాలి. చాలా మంది తమ డ్యాన్స్ పరఫార్మెన్స్ లతో విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఉన్నారు. అయితే, ఆ హీరోలు అంత బాగా డ్యాన్స్ వేయడానికి వారికి వెనక ఉన్న కొరియోగ్రాఫర్లే కారణం. వారు డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసి, వాటిని హీరోలతో చేయిస్తూ ఉంటారు.

అయితే, ఇప్పుడు ఆ తెరవెనక ఉండే కొరియాగ్రాఫర్లు తెర మీదకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అర్థం కాలేదా? టాలీవుడ్ లోని ఇద్దరూ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు హీరోలుగా ప్రయత్నించాలని చూస్తున్నారు.

వారే జానీ మాస్టర్, యశ్ మాస్టర్. ఈ ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లకు, వారి కొరియోగ్రఫీకి మాములుగానే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ని ఉపయోగించుకొని వారు హీరోలగా సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రభుదేవ కూడా గతంలో డ్యాన్స్ కొరియోగ్రాఫరే. కానీ, ఆయన కూడా నటుడిగా, హీరోగా మారి సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఆయన బాటలోనే ఈ ఇద్దరు మాస్టర్లు నడవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ హీరోగా 'యథా రాజా తధా ప్రజా' అనే సినిమాను మొదలుపెట్టారు. ఇందులో 'సినిమా బండి' ఫేమ్ వికాస్ మరో హీరో. శ్రష్టి వర్మ హీరోయిన్.

ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.కాగా, ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. త్వరలోనే, ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక, ఈటీవీలో ప్రసారమయ్యే ఢీషోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన యశ్ మాస్టర్ కూడా హీరోగా తన లక్ ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న యశ్ మాస్టర్‌ను హీరోగా లాంచ్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట.దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మరి, కొరియోగ్రాఫర్లు గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరు, హీరోలుగా ఎలా సక్సెస్ అవుతారో చూడాలి అంటే, కొంత కాలం ఆగాల్సిందే. మరి వారు ఎలాంటి కథలను ఎంచుకుంటారో చూడాలి.