Begin typing your search above and press return to search.

300తో సినీ ఇండ‌స్ట్రీకి.. 200 కోట్లు అందుకుంటున్న న‌టుడు!

ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్ అంతా ఎవ‌రి గురించి? అంటే.. ది గ్రేట్ రాఖీ భాయ్ అలియాస్ య‌ష్ గురించే.

By:  Tupaki Desk   |   29 April 2024 3:15 AM GMT
300తో సినీ ఇండ‌స్ట్రీకి.. 200 కోట్లు అందుకుంటున్న న‌టుడు!
X

జేబులో కేవలం రూ. 300తో సినీ ఇండ‌స్ట్రీకి వెళ్లాడు... ఆరంభం అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసాడు... త‌ర్వాత న‌టుడ‌య్యాడు. హీరోగా ఎదిగాడు. ఒకే ఒక్క యాక్ష‌న్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేసాడు య‌ష్‌. ఇప్పుడు ఒక్కో సినిమాకి 200 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. భార‌త‌దేశంలో అరుదైన పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల‌కు సంత‌కాలు చేస్తూ భారీ పారితోషికాల్ని ఖాతాలో వేసుకుంటున్నాడు.

ప‌రిశ్ర‌మ‌లో ఒక సాధార‌ణ యువ‌కుడిగా మొద‌లై, హార్డ్ వ‌ర్క్ తో.. ఒక్కో విజ‌యం అందుకుంటూ.. విజయాల మెట్లు ఎక్కి మరెవరూ సాధించలేని దానిని సాధించాడు. అతడి సామర్థ్యం - స్టార్‌డమ్ ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లో హాట్ టాపిక్. దేశంలోని అత్యుత్త‌మ స్టార్ల‌లో ఒక‌రిగా అత‌డు ఎదిగాడు.

ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్ అంతా ఎవ‌రి గురించి? అంటే.. ది గ్రేట్ రాఖీ భాయ్ అలియాస్ య‌ష్ గురించే. భారతీయ సినిమాకి చెందిన ఏకైక రాకీ భాయ్.. రాకింగ్ స్టార్ యష్ గురించే ఇదంతా. కేజీఎఫ్ స్టార్ గా అత‌డు ప‌వ‌ర్ ఫుల్ పొజిష‌న్ లో ఉన్నాడు. ఒక‌ప్పుడు శాండల్‌వుడ్ నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ నెమ్మ‌దిగా బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాకి ఫేస్ గా మారాడు. కేజీఎఫ్ 2తో 1000 కోట్ల క్ల‌బ్ క‌థానాయ‌కుడిగా ఎదిగాడు. అయితే అత‌డు కేవలం రూ. 300తో తన ఇంటి నుంచి వెళ్లిపోయాడనేది ఎంద‌రికి తెలుసు?

కర్ణాటక- హాసన్‌లోని ఒక గ్రామంలో జన్మించిన యష్ తన చిన్నతనంలో సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపాడు. అతని తండ్రి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డ్రైవర్. అతడి తల్లి గృహిణి. ఈ జీవనశైలిలో పెరిగిన య‌ష్ తాను నటుడిగా మారాలని కోరుకున్నాడు. తద్వారా అతడు తన పాఠశాల విద్యను కూడా విడిచిపెట్టాలని కోరుకున్నాడు. అయితే తల్లిదండ్రుల డిమాండ్ మేర‌కు తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు.

య‌ష్ సినీ కెరీర్‌ని కొనసాగించడం కంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని పేరెంట్ కోరుకున్నారు. కానీ చివ‌రికి తాను ఏమ‌వ్వాల‌నుకుంటున్నాడో అదే ప్ర‌య‌త్నించ‌మ‌ని అనుమతించారు. అతడు 16 సంవత్సరాల వయస్సులో బెంగళూరుకు వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అవ‌స‌ర‌మైన ప్రోత్సాహం అందించారు. అయితే అతడు అనుకున్న‌ది సాధించ‌లేక‌ ఇంటికి తిరిగి వస్తే రెండవ అవకాశం ఇవ్వలేమ‌ని పేరెంట్ షరతు విధించారు.