Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : నామినేషన్స్ రచ్చ.. సోనియా వర్సెస్ కిరాక్ సీత..!

నైనిక ఉండగా యష్మి వల్ల ప్రేరణని విష్ణు ప్రియతో స్వాప్ చేయించడం వల్ల విష్ణు ప్రియ కూడా డైరెక్ట్ నామినేషన్స్ లో ఉండాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 4:29 AM GMT
బిగ్ బాస్ 8 : నామినేషన్స్ రచ్చ.. సోనియా వర్సెస్ కిరాక్ సీత..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. సోమవారం ఎపిసోడ్ లో పూర్తిగా నామినేషన్స్ ఇవ్వలేదు కానీ 24/7 లో మాత్రం నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం నామినేషన్స్ పోటాపోటీగా జరిగాయి. 3 క్లాన్ లుగా ఉన్న హౌస్ మెట్స్ లో ఒకరి క్లాన్ లో ఉన్న సభ్యులు మరో క్లాన్ లో వారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా కిరాక్ సీత సోనియా, ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ కూడా బాత్ రూమ్స్ క్లీన్ చేయలేదని సీతతో వాదన పెట్టుకుంది.

జరిగిన నామినేషన్స్ భాగంగా ప్రేరణ, ఆదిత్య ఓం, మణికంఠ, పృధ్వి, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక ఉండగా యష్మి వల్ల ప్రేరణని విష్ణు ప్రియతో స్వాప్ చేయించడం వల్ల విష్ణు ప్రియ కూడా డైరెక్ట్ నామినేషన్స్ లో ఉండాల్సి వచ్చింది. సో ఈ వారం నామినేషన్స్ లో విష్ణు ప్రియ, మణికంఠ, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, నిఖిల్, నైనిక, సీత, శేఖర్ బాషాలు నామినేషన్స్ లో ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా రెండో వారం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు ఈసారి వీరిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఎవరు సేవ్ అవుతారన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ రెండో వారానికే వేడెక్కించేలా చేశారు హౌస్ మెట్స్. హౌస్ లో ఇప్పుడే ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది క్లారిటీ వస్తుంది.

ప్రేక్షకులు కూడా ఎవరిలో ఏ టాలెంట్ ఉంది. ఎవరు లీడ్ గా రాణించగలుగుతున్నారు అన్నది గమనిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అవుతుంది. ప్రతి టాస్క్ ఇది వరకు జరిగినట్టు కాకుండా కొత్తగా ఇస్తున్నారు. ఇక రెండో వారం కూడా క్లాన్ ను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. ఈ నామినేషన్స్ లో శేఖర్ బాషా, ఆదిత్య ఓం ల సీరియస్ కామెడీ ఆడియన్స్ ని భలే ఎంటర్టైన్ చేసింది. అఫ్కోర్స్ వారు సీరియస్ గానే ఒకరినొకరు నామినేట్ చేసుకున్నా అది మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది.