Begin typing your search above and press return to search.

సలార్ లో యశ్ పక్కా.. ఇదిగో ప్రూఫ్

భారతీయ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది

By:  Tupaki Desk   |   11 Dec 2023 10:17 AM GMT
సలార్ లో యశ్ పక్కా.. ఇదిగో ప్రూఫ్
X

భారతీయ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. పలుమార్లు వాయిదాపడ్డ ఈ మూవీ.. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వనుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు, యశ్ ఓవర్ నైట్ స్టార్ ను చేసిన కేజీఎఫ్ కు లింక్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అది పక్కా అంటూ పలువురు అభిమానుల జోస్యం కూడా చెప్పారు. అయితే సలార్, కేజీఎఫ్ కు ఎలాంటి లింక్ లేదని ఇటీవలే ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు నెట్టింట మరో అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ యశ్ ఓ పాత్రలో కనిపించనున్నారట. మూవీ క్లైమాక్స్ లో కానీ, మధ్యలో కానీ ఒక చిన్న కెమియోతో యశ్ కనిపించి అలరించనున్నారని ఫిల్మ్ వర్గాల నుంచి వస్తున్న లేటెస్ట్ టాక్. అందుకు ప్రూఫ్ గా ఓ ఆర్టిస్ట్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తున్నారు.

సలార్ మ్యూజిక్ టీమ్ కు చెందిన ఒక బ్యాక్ గ్రౌండ్ సింగర్ ఇటీవలే మలయాళం ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తాను సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆలపించినట్లు చెప్పింది. ప్రభాస్ అంకుల్, యశ్ అంకుల్, పృథ్వీరాజ్ సుకుమార్ అంకుల్ ముగ్గురు కలిసి నటించిన సినిమాలో పాడినట్లు చెప్పింది. తాను మూడు భాషల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాడినట్లు తెలిపింది.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ కచ్చితంగా సలార్ లో యశ్ కు కీలక పాత్ర ఇచ్చి ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లు షేక్ అయిపోతాయని అంటున్నారు. సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ సీన్సుతోపాటు యశ్ కెమియో ప్రేక్షకులకు ఫుల్ వినోదం పంచనునందని అంటున్నారు.

సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌‍‌తో ప్రశాంత్ నీల్ మరో సినిమా తెరకెక్కించనున్నారు. కేజీఎఫ్, సలార్, ఎన్టీఆర్ 31 చిత్రాలతో కలిపి ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. కాగా సలార్ మూవీలో ప్రభాస్‌తో పాటు శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, శరణ్ శక్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.