Begin typing your search above and press return to search.

వెయ్యి కోట్ల హీరోకు పవర్ఫుల్ సెంటిమెంట్

రాకింగ్ స్టార్ యష్ నుంచి వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది

By:  Tupaki Desk   |   8 Aug 2024 3:30 PM GMT
వెయ్యి కోట్ల హీరోకు పవర్ఫుల్ సెంటిమెంట్
X

రాకింగ్ స్టార్ యష్ నుంచి వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొదటి సారి 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న కన్నడ హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా తర్వాత యష్ కి దేశ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. కేవలం కన్నడ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే గత ఏడాది యష్ కొత్త సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. మలయాళీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని అఫీషియల్ గా ప్రకటించారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథాంశం డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. ఈ సినిమాకి టాక్సిక్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తాజాగా మొదలెట్టారు. ఇన్ని రోజుల పాటు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ మూవీ ఉంది. ఫైనల్ గా ఫైనల్ గా గురువారం టాక్సిక్ మూవీ షూటింగ్ ని అఫీషియల్ గా ప్రారంభించినట్లు అప్డేట్ ఇచ్చారు. యష్ కూడా షూటింగ్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇన్ని రోజులు ఎందుకు షూటింగ్ స్టార్ట్ కాలేదనేది ఎవరికి క్లారిటీ లేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. రాకింగ్ స్టార్ యష్ లక్కీ నెంబర్ 8 అందుకే ఎనిమిదో నెల 8వ తేదీన ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడంట. అలాగే 2024 మొత్తం కలిపిన కూడా 8 వస్తుంది. న్యూమరాలజీ సెంటిమెంట్ ఉన్నవారు ఈ లక్కీ నెంబర్ సిస్టమ్ ని బాగా ఫాలో అవుతారు.

ప్రస్తుతం ఇదే టాపిక్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. న్యూమరాలజీ సెంటిమెంట్ చూసుకొని ఇంత లేట్ గా షూటింగ్ లో జాయిన్ కావడంపై సోషల్ మీడియాలో యష్ పై కౌంటర్లు వేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అయితే ఇండస్ట్రీలో నంబర్స్ సెంటిమెంట్ ని చాలా మంది స్టార్ హీరోలు బిలీవ్ చేస్తారు. సినిమాల రిలీజ్ ల విషయంలో కూడా సెంటిమెంట్ ఫాలో అయ్యేవారు ఉన్నారు.

అలాగే సినిమాలని, స్టార్ట్ చేయడమే కాకుండా మూవీ టైటిల్స్ విషయంలో కూడా కొంతమంది న్యూమరాలజీని అనుసరిస్తారు. ఎవరి సెంటిమెంట్ వారికుంటుంది. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మోనిస్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యష్ టాక్సిక్ మూవీతో పాటు హిందీలో తెరకెక్కనున్న రామాయణం మూవీలో రావణుడిగా చేయనున్నాడు.