Begin typing your search above and press return to search.

యశ్ టాక్సిక్ అసలేం జరుగుతుంది..?

K.G.F స్టార్ యశ్ తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ తో కూడా భారీ టార్గెట్ తోనే వస్తున్నాడని అర్థమవుతుంది

By:  Tupaki Desk   |   28 July 2024 1:30 AM GMT
యశ్ టాక్సిక్ అసలేం జరుగుతుంది..?
X

K.G.F స్టార్ యశ్ తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ తో కూడా భారీ టార్గెట్ తోనే వస్తున్నాడని అర్థమవుతుంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. సినిమాను షూటింగ్ సైలెంట్ గా జరుపుతున్నారు. షూటింగ్ లొకేషన్ నుంచి ఎలాంటి పిక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా కూడా K.G.F రేంజ్ లోనే మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. 1950-70 కాలం నాటి కథగా టాక్సిక్ రాబోతుందని తెలుస్తుంది.

సినిమాలో నయనతార, కియరా అద్వాని, తార సుతారియా, హ్యూమా ఖురేషి ఇలా నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ హీరోయిన్స్ గురించి చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఒక్క అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఐతే సినిమా అనౌన్స్ మెంట్ రోజే 2025 ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ లాక్ చేశారు. స్టార్ సినిమాలు ముందు రిలీజ్ చేయడం ఆ తర్వాత వాయిదా వేయడం కామనే. ఈ క్రమంలోనే యశ్ టాక్సిక్ కూడా ఏప్రిల్ లో రిలీజ్ కష్టమని కొందరు అంటున్నారు.

సినిమాను అనుకున్న దాని కన్నా భారీగా తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో సినిమాను రిలీజ్ టార్గెట్ పెట్టి పూర్తి చేయాలి అన్నట్టు కాకుండా సినిమా అవుట్ పుట్ మీద ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. యశ్ సినిమాపై కొన్ని చోట్ల పాజిటివ్ న్యూస్.. మరికొన్ని చోట్ల నెగిటివిటీ ఇలా టాక్సిక్ పై ఊహించని డిస్కష్న్ జరుగుతుంది. ఐతే సినిమా గురించి ఏం మాట్లాడినా అది ప్రమోషన్ కిందకే వస్తుంది కాబట్టి మేకర్స్ కూడా బయట జరుగుతున్న హడావిడి చూస్తూ సైలెంట్ గా ఉంది.

యశ్ టాక్సిక్ సినిమా రిలీజ్ వాయిదా పై వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించాల్సి ఉంది. K.G.F తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యశ్ రాబోయే సినిమాలతో కూడా ఆ రేంజ్ కి తగినట్టుగానే సినిమాలు అందించాలని చూస్తున్నాడు. యశ్ టాక్సిక్ కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఇది కూడా K.G.F రేంజ్ అందుకుంటే మాత్రం యశ్ స్టామినా ఏంటన్నది మరోసారి బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ అయినట్టే లెక్క. యశ్ టాక్సిక్ పై మిగతా అన్ని చోట్ల ఏమో కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారని తెలుస్తుంది.