Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా హీరో కోసం ఎంత మంది దిగుతార‌బ్బా?

పాన్ ఇండియా స్టార్ య‌శ్ 19వ చిత్రం గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌కత్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 May 2024 2:45 AM GMT
పాన్ ఇండియా హీరో కోసం ఎంత మంది దిగుతార‌బ్బా?
X

పాన్ ఇండియా స్టార్ య‌శ్ 19వ చిత్రం గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌కత్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. 'టాక్సిక్' టైటిల్ తో దీన్ని పాన్ ఇండియాలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈసినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. 'టాక్సిక్' అనై టైటిల్ సైతం అంతే ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. దీంతో హీరోయిన్ల విష‌యంలోనూ గీతూ మోహ‌న్ దాస్ అంతే కేర్ పుల్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పాన్ ఇండియాలో ఇమేజ్ ఉన్న బ్యూటీల్నే ప‌రిశీలిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే 'జ‌వాన్' తో హిందీ మార్కెట్ లోకి అడుగు పెట్టిన న‌య‌న‌తార పేరు తెర‌పైకి వ‌చ్చింది. య‌శ్ కి ప‌ర్పెక్ట్ జోడీగా న‌య‌న్ బాగుంటుంద‌ని ఆమె భావించిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అటుపై బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. సౌత్ లో ఓ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు క‌రీనా కూడా రివీల్ చేయ‌డం అప్ప‌ట్లో ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే కొన్ని రోజుల‌కి క‌రీనా హీరోయిన్ గా కాదు..సిస్ట‌ర్ రోల్ పోషిస్తుంద‌ని మ‌రో ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

'టాక్సిక్' అనేది తోబుట్టువ‌ల క‌థ అని...య‌శ్ సోద‌రి పాత్ర‌లోనే క‌రీనా న‌టిస్తుంద‌ని..జోడీగా కాదంటూ ఓ వార్త వైర‌ల్ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో బాలీవుడ్ బ్యూటీ తెర‌పైకి వ‌చ్చింది. ఆమె హ్యూమా ఖురేషీ .ఓ కీల‌క పాత్ర‌కి ఖురేషీని ఎంపిక చేసిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ఆమె పాత్ర పూర్తిగా యాక్ష‌న్ కోణంలో ఉంటుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే సినిమా సెట్స్ కివెళ్ల‌డానికి ముందే ఈ రేంజ్ లో బ‌జ్ క్రియేట్ అవుతుందంటే? మొద‌లైన త‌ర్వాత ఇంకేస్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

కీల‌క పాత్ర‌ల‌కే టాప్ భామ‌ల్ని రంగంలోకి దించుతున్నారంటే? విల‌న్..విల‌నీ పాత్ర‌ల‌కు ఇంకేలాంటి క్రేజీ స్టార్ల‌ను దించుతారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 'కేజీఎఫ్' తో య‌శ్ పాన్ ఇండియా వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన య‌శ్ నేడు ఇండియానే షేక్ చేస్తున్నాడు.