Begin typing your search above and press return to search.

యూకేలో 150 రోజులు.. టాక్సిక్ కిక్ ఇస్తున్న అప్డేట్..!

యష్ టాక్సిక్ ని కూడా భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 1:30 PM GMT
యూకేలో 150 రోజులు.. టాక్సిక్ కిక్ ఇస్తున్న అప్డేట్..!
X

కె.జి.ఎఫ్ తర్వాత కన్నడ హీరో యష్ చేస్తున్న సినిమా టాక్సిక్. కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన యష్ ఆ టైం లో తనకు భారీ ఆఫర్లు రాగా ముందు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగానే గీతు మోహన్ దాస్ కు అవకాశం ఇచ్చారు. అంతేకాదు ఆఫ్టర్ కె.జి.ఎఫ్ ఆ రేంజ్ కు తగిన కథ ఐతేనే బాగుంటుందని అనుకున్న యష్ అందుకు తగిన కథను పిక్ చేసుకున్నాడని తెలుస్తుంది. యష్ టాక్సిక్ ని కూడా భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. అందుకు నిదర్శనమే కొత్త షెడ్యూల్ ప్లానింగ్ అని చెప్పొచ్చు.

మామూలుగా ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ అంటే ఇలా వెళ్లి అలా వస్తేనే నిర్మాతకు తడిసి మోపెడు అవుతుంది. అలాంటిది టాక్సిక్ కోసం ఏకంగా యూకే లో 150 రోజుల షూటింగ్ ప్లాన్ చేశారట మేకర్స్. దాదాపు 5 నెలలు చిత్ర యూనిట్ మొత్తం అక్కడ ఉండటంతో పాటుగా భారీ లొకేషన్స్ లో షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. ఈ షూటింగ్ లో సినిమాకు సంబందించిన మెయిన్ కాస్ట్ అంతా కూడా పాల్గొంటుందని తెలుస్తుంది.

యష్ టాక్సిక్ సినిమాలో కియరా అద్వాని, నయనతార, హ్యూమా ఖురేషి నటిస్తున్నారు. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుండగా నయనతార ఈ సినిమాలో యష్ కి సిస్టర్ రోల్ లో నటిస్తుందని టాక్. ఈ సినిమాలో నటించేందుకు గాను నయనతార రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుందని తెలుస్తుంది.

యష్ కూడా కె.జి.ఎఫ్ తర్వాత ఆడియన్స్ తన మీద పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టాక్సిక్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం తను పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. యష్ టాక్సిక్ 2025 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. మరి కె.జి.ఎఫ్ తో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అందరినీ అలరించిన యష్ టాక్సిక్ తో కూడా ఆ రేంజ్ సంచలనాలు సృష్టిస్తాడా లేదా అన్నది చూడాలి. టాక్సిక్ సినిమా కోసం ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కె.జి.ఎఫ్ రెండు భాగాలతో తెలుగులో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన యష్ పై తెలుగు ఆడియన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కన్నడ ఫ్యాన్స్ కు ఈక్వల్ గా తెలుగు ప్రేక్షకులు టాక్సిక్ కోసం ఈగర్ గా ఉన్నారని చెప్పొచ్చు.