అమెరికాలో YATRA2 విలక్షణ ప్రచారం
YATRA2 బృందం డల్లాస్‌లోని YSRCP అభిమానుల మద్దతుతో వినూత్న ప్రచారానికి సంకల్పించింది.
By: Tupaki Desk | 7 Feb 2024 9:27 AM GMTడాక్టర్ వైఎస్ఆర్, ఆయన వారసుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితాలను తెరపై ఆవిష్కరిస్తూ రూపొందించిన బయోపిక్ `యాత్ర 2`. ఈ అసాధారణ వ్యక్తులు తమ సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది జీవితాలను స్పృశించారు. ప్రజల మనుషులుగా గౌరవనీయ స్థానాన్ని సంపాదించారు. అజేయమైన నాయకత్వం..మార్పు కోసం నాయకుడిగా తీసుకున్న చొరవ దార్శనిక నాయకుల లక్షణాలు. అవి తమకు ఉన్నాయని నిరూపించారు వైయస్ జగన్. ఇప్పుడు యాత్ర 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్ని చిత్రబృందం వైవిధ్యంగా ప్లాన్ చేస్తోంది.
YATRA2 బృందం డల్లాస్‌లోని YSRCP అభిమానుల మద్దతుతో వినూత్న ప్రచారానికి సంకల్పించింది. ఈ చొరవ కార్టర్ బ్లడ్‌కేర్‌లో రక్తదాన డ్రైవ్‌తో ప్రారంభమైంది. తర్వాత డజన్ల కొద్దీ ఎస్కార్ట్‌లు దాదాపు 516 కార్ల కాన్వాయ్‌తో కూడిన అద్భుతమైన ర్యాలీ జరిగింది. 1000 మందికి పైగా హాజరైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ మహత్తరంగా సాగింది. అన్ని వయసుల ప్రజలు వేదిక వద్ద అపారమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ అసాధారణమైన ప్రక్రియకు తమవంతు సహకారం అందించారు. ఇది డల్లాస్ చరిత్రలో ఒక అపూర్వమైన సంఘటన.
ఈ తరహా ప్రచార విజయం మాటల్లో చెప్పలేనిది. లిటిల్ ఎల్మ్, ఫ్రిస్కో, ప్లానో, ప్రోస్పర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, ఉత్కంఠభరితమైన ఎయిర్‌షో కోసం మూడు హెలికాప్టర్‌లను సోమవారం (ఫిబ్రవరి 5వ తేదీ) సాయంత్రం ప్రదర్శించారు. DFW విమానాశ్రయం సమీపంలో ఉన్న కారణంగా ఇర్వింగ్/కొప్పెల్ ప్రాంతాలలో భద్రతా పరిమితుల నడుమ ఈ కార్యక్రమం ప్లాన్ చేసారు.
వేడుకలో తిరుమల రెడ్డి కుంభం ప్రారంభించాక MC మైత్రేయి మియాపురంని పరిచయం చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అహూతులను ఉద్దేశించి నిర్మాత శివ మేకకు స్వాగతం పలికారు. యాత్ర2 కోసం సంతోష్ నారాయణ్, మాధి (DP) వంటి గొప్ప సాంకేతిక బృందంతో పాటు మమ్ముట్టి, జీవా, కేతకి సహా పాపులర్ నటులతో దర్శకుడు మహి వి రాఘవ్ ప్రయత్నం విస్మరించలేనిది. మహి.వి- నిర్మాత శివ మేక నిజమైన హీరోలుగా ఉద్భవించారు. వీరిద్దరూ గౌరవనీయమైన స్ఫూర్తిదాయకమైన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్ అడుగుజాడల్లో నడిచి ఈ చిత్రాన్ని రూపొందించారు. USAలోని నిర్వాణ డిస్ట్రిబ్యూటర్స్ నుండి సందీప్ రెడ్డి సహకారానికి ధన్యవాదాలు.
యాత్ర 2 ప్రజల మనసులపై చెరగని ముద్ర వేస్తుందని అంతా నమ్ముతున్నారు. కాలపరీక్షకు నిలిచిన క్లాసిక్ తెలుగు చిత్రాలకు ధీటుగా గౌరవం అందుకుంటుంది. YATRA2ని సినిమాటిక్ మాస్టర్ పీస్‌గా మార్చే ప్రయత్నం అద్భుతంగా సాగింది. రోహిత్ గంగిరెడ్డి & టీమ్ (జగదీష్ మరియు ఇతరులు), ఆదిత్య పల్లేటి, శ్రీకాంత్ జొన్నల వంటి యూత్ టీమ్ కి ఈ క్రెడిట్ దక్కుతుంది. బలమైన ఉద్దేశ్యంతో, మా నాయకుడు విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారతలో సంచలనాత్మక పథకాలను అమలు చేశారు. ఈ పథకాలు సమగ్ర నవరత్నాలుగా పాపులరయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యను పొందడం వంటి కార్యక్రమాల ద్వారా నేరుగా లబ్ధి పొందిన అసంఖ్యాక యువకులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మాకు లభించిన అఖండ మద్దతు ఉత్సాహం మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆలంబన. 175 మంది ఎమ్మెల్యేల్లో 175 మందిని, 25 మంది ఎంపీల్లో 25 మందిని గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అయిన మన ప్రియతమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం మరో 30 సంవత్సరాలు రాష్ట్రానికి నాయకత్వం వహించాలనేది అభిమానుల ఆకాంక్ష.
అమెరికాలో సహకారానికి థాంక్స్:
స్థానిక నాయకులైన శ్రీధర్ కొరసపాటి, రామన్‌రెడ్డి క్రిష్టపతి, డాక్టర్ పవన్ పామదుర్తి, రమణ పుట్లూరు, శివ అన్నపురెడ్డి, దర్గా నాగిరెడ్డి, భాస్కర్ గండికోట, సునీల్ దేవిరెడ్డి, ఓఎస్‌ఆర్, రాజేంద్ర పోలు, చెన్న కొర్వి తదితరులకు మా హృదయపూర్వక అభినందనలు. అదనంగా మొత్తం కమ్యూనిటీ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల గౌరవప్రదమైన ఆన్‌లైన్ ప్రచురణలు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. రాయలసీమ రుచులు, దేశీ జిల్లా, కుండ భోజనం, ప్రసూనస్ కిచెన్ అందించిన ఆహ్లాదకరమైన వంటకాలు ఈవెంట్‌లను మరింత మెరుగుపరిచాయి. ఇంకా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన స్థానిక సంఘాట నాయకులకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము... అన్నారు.