Begin typing your search above and press return to search.

యాత్ర 2.. వైఎస్ జగన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

ఈ సినిమాలో వైఎస్ మరణాంతరం 2009 నుంచ 2019 వరకు వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణాన్ని చిత్రంలో చూపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2023 6:29 AM
యాత్ర 2.. వైఎస్ జగన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
X

మహి వి రాఘవ దర్శకత్వంలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి టైటిల్ రోల్ లో వచ్చిన యాత్ర మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. 2019 ఎన్నికలకి ముందు రిలీజ్ అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ మూవీ కథని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఆ టైంలో మూవీ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో పాటుగా వైసీపీ ఎన్నికలలో గెలవడానికి కూడా యాత్ర మూవీ కొంత హెల్ప్ అయ్యింది.


మరల నాలుగేళ్ల తర్వాత మహి వి రాఘవ యాత్ర 2 చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో వైఎస్ మరణాంతరం 2009 నుంచ 2019 వరకు వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణాన్ని చిత్రంలో చూపించబోతున్నారు. ఈ ప్రయాణంలో ఓదార్పు యాత్ర, జైలు జీవితం తరువాత 2014 ఎన్నికల ఓడిపోవడం 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవడం వరకు ఉంటుందంట.

అలాగే ఈ చిత్రంలో ప్రజల నమ్మకాన్ని గెలవడం కోసం జగన్ ఎలాంటి ఆలోచనలతో ముందుకి వెళ్ళాడు అనేది కథలో భాగంగా చూపించబోతున్నారంట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వైఎస్ జగన్ పాత్రలో జీవాని, రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టిని చూపించారు.

ఇద్దరు కూకా చాలా ఇంటెన్సివ్ లుక్ లో ఉన్నట్లు ఆవిష్కరించారు. జగన్ పాత్రకి జీవా కరెక్ట్ గా యాప్ట్ అనినట్లు కనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి మరణం కూడా మూవీలో ఉంటుందంట. పోస్టర్ పైన మహి వి రాఘవ ఇంటరెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అంటూ డైలాగ్ తో కథ ఇంటెన్షన్ ఏంటనేది దర్శకుడు చెప్పకనే చెబుతున్నారు.

మరి యాత్రకి సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీ యాత్ర 2 కూడామొదటి చిత్రం తరహాలోనే మంచి సక్సెస్ అందుకొని వైసీపీకి ఎన్నికల పరంగా కూడా ఉపయోగపడుతుందా లేదా అనేది వేచి చూడాలి. యాత్ర 2ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తూ సినిమాకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.