Begin typing your search above and press return to search.

యాత్ర2: భయమెరుగని భారతి

ఇప్పటికే మరాఠీలో కేతకి నారాయణ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనే సినిమాలో నటించింది

By:  Tupaki Desk   |   9 Dec 2023 9:59 AM GMT
యాత్ర2: భయమెరుగని భారతి
X

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో 2019 ఎన్నికలకి ముందు మహి వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన యాత్ర మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు. మరల ఐదేళ్ల తర్వాత మహి వి రాఘవ యాత్ర 2 చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపొయింది.


ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రతో పాటు వైఎస్ జగన్ పాత్ర కూడా ఉండబోతోంది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ రాజకీయ ప్రయాణం, అరెస్ట్ లు, 2019 ఎన్నికలలో విజయం సాధించడం వరకు ఉన్న జర్నీని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో జగన్ పాత్రలో తమిళ్ యాక్టర్ జీవా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

యూవీ సెల్యులాయిడ్, త్రీ ఆక్టమ్ లీవ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి మది సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా వైఎస్ భారతి పుట్టిన రోజు సందర్భంగా మూవీలో ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మరాఠీ యాక్టర్ కేతకి నారాయణ్ భారతి పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటికే మరాఠీలో కేతకి నారాయణ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనే సినిమాలో నటించింది. యాత్ర 2 తెలుగులో ఆమెకి రెండో మూవీ కావడం విశేషం. డిజిటల్ ఎంట్రీ ఇచ్చి నాలుగు వెబ్ సిరీస్ లలో కూడా ఈ బ్యూటీ నటించింది. అచ్చం వైఎస్ భారతి తరహాలో మేకోవర్ చేసి చిత్ర యూనిట్ ఆమె లుక్ రిలీజ్ చేశారు.

చూడగానే వైఎస్ భారతి అనేంత దగ్గర పోలికలతో ఆమె ఉండటం విశేషం. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ ఫాలోవర్స్ ఈ ఫోటోని ట్వీటర్ పేజీలలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో ఇంటరెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'నిజమేన్నా మా ఇంట్లో ఆడాళ్ళకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు' అనే క్యాప్షన్ తో భారతి పాత్రని సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తున్నారో చెప్పకనే చెప్పారు.