Begin typing your search above and press return to search.

యాత్ర 2 బడ్జెట్ ఎంతంటే?

వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం, పాదయాత్ర నేపథ్యంలో మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యాత్ర 2

By:  Tupaki Desk   |   6 Feb 2024 12:30 AM GMT
యాత్ర 2 బడ్జెట్ ఎంతంటే?
X

వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం, పాదయాత్ర నేపథ్యంలో మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యాత్ర 2. ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ సపోర్టర్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరీ ఎక్కువగా రాజకీయాలు టచ్ చేయకుండా కేవలం కథ మొత్తం జగన్ మీదనే దర్శకుడు నడిపించారు.

ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. యాత్ర మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్ మరణాంతరం రాష్ట్రంలో చాలా మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఈ ఓదార్పు యాత్రకి వ్యతిరేకత రావడంతో పాటు జగన్ పై అక్రమ ఆస్తుల కేసులు కూడా తెరపైకి తీసుకొచ్చారు. దీంతో 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు.

తరువాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి తండ్రి ఆశయాల కోసం జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. జగన్ పాత్రలో తమిళ్ యాక్టర్ జీవా నటించాడు. యూవీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే మూవీకి 50 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందంట. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన కంటెంట్ మీద నమ్మకంతోనే ఆ స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకి మెజారిటీగా వైసీపీ సపోర్టర్స్ నుంచి మాత్రం మద్దతు దొరుకుతుంది.

కంటెంట్ లో దమ్ముంటే కామన్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించవచ్చు. ఫైనాన్సియల్ గా మాత్రం యాత్ర 2తో నిర్మాతలకి నష్టాలు వచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అయితే 2024 ఎన్నికల నేపథ్యంలో జగన్ కి ఫెవర్ గా మూవీ వస్తోంది కాబట్టి ఆ పార్టీకి ఎంతోకొంత బలం ఇచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

మరి ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మూవీలో చంద్రబాబుని ప్రతినాయకుడిగా చూపిస్తే మాత్రం తెలుగు దేశం పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. మరి మహి వి రాఘవ వివాదం లేకుండా యాత్ర 2ని ఎలా డీల్ చేసాడనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ రన్ టైం 2 గంటల 10 నిమిషాలు ఉంటుందంట. అధికారంలో ఉన్న వైసీపీ సపోర్ట్ ఈ మూవీకి లభిస్తే మాత్రం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు.