Begin typing your search above and press return to search.

యాత్ర 2 వీటి ఇంపాక్ట్ ఎక్కువే..!

పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే.. పులిని బోనులో పెట్టినా అది పులే.

By:  Tupaki Desk   |   9 Feb 2024 9:10 AM GMT
యాత్ర 2 వీటి ఇంపాక్ట్ ఎక్కువే..!
X

2019లో వచ్చిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ. యాత్ర కథ వైఎస్సార్ పదాయాత్ర నేపథ్యంతో తెరకెక్కించగా యాత్ర 2 వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర కథాంశంతో నడిపించారు. సినిమాగా తీసే ప్రతి కథ అది జరిగిన కథ అయ్యి ఉండొచ్చు.. కల్పిత కథ అయినా అవ్వొచ్చు. కథ ఏదైనా దర్శకుడు ఎంచుకున్న కథను తెర మీద చూపించే విధానాన్ని బట్టి ప్రేక్షకులు తమ రెస్పాన్స్ అందిస్తారు.

వైఎస్ పాదయాత్రతో వచ్చిన యాత్రతో సక్సెస్ అందుకున్న మహి వి రాఘవ యాత్ర 2తో కూడా సిన్సియర్ ఎఫర్ట్ తో తీశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు కథాంశంతో వచ్చిన ఈ యాత్ర 2 లో కథ కథనాలతో పాటు ప్రేక్షకులను డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. సన్నివేశాలకు తగినట్టుగా మహి వి రాఘవ యాత్ర 2 లో మంచి డైలాగ్స్ రాశారు. వాటిలో కొన్నిటిని చూస్తే..

జగన్ కడపోడు సార్.. శతృవుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక.. వాళ్లు నాశనం అయిపోతారు అని తెలిసినా.. శతృవుకి తల వంచరు సార్..

నాకు భయపడడం రాదు.. నేను ఏంటో.. నా రాజకీయ ఏంటో మీకు ఇంకా అర్ధం కాకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని.

పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే.. పులిని బోనులో పెట్టినా అది పులే.

ఎన్నికలు అయిపోయాక జనాన్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేను.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయనా లేడు.. నేనూ లేను.

దేవుడు కేవలం నమ్మకం అన్న.. కానీ వైఎస్సార్ నిజం.

కడపోల్లకి ఎండలు, కష్టాలు కొత్త కాదు.

ఈ రోజుల్లో సిద్ధాంతాలు, విలువలు పనికి రావయ్య అవసరాలను బట్టి ముందుకుపోవాలి.

చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుందో నాకు అనవసరం.. ఒకవేళ గుర్తుపెట్టుకుంటె తండ్రి కొసం ఇచ్చిన మాటని తప్పని కొడుకుగా చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలా డైలాగ్స్ తో సినిమాపై ఇంపాక్ట్ కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు మహి వి రాఘవ.