Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : యావర్ చేసిన పనికి ఎలిమినేషన్ లో మార్పు..!

బిగ్ బాస్ సీజన్ 7 లో మరో నాలుగు వారాలే ఉండగా ప్రతి టాస్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. గడిచిన వారం జరిగిన ఎవిక్షన్ పాస్ టాస్క్ లో యావర్ గెలిచాడు

By:  Tupaki Desk   |   19 Nov 2023 4:38 AM GMT
బిగ్ బాస్ 7 : యావర్ చేసిన పనికి ఎలిమినేషన్ లో మార్పు..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో మరో నాలుగు వారాలే ఉండగా ప్రతి టాస్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. గడిచిన వారం జరిగిన ఎవిక్షన్ పాస్ టాస్క్ లో యావర్ గెలిచాడు. ప్రతి సీజన్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇస్తాడు. కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా కదా అందుకే ఎవిక్షన్ పాస్ ఇచ్చాడు బిగ్ బాస్. యావర్ గెలిచిన ఈ ఎవిక్షన్ పాస్ గురించి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున యావర్ కి రెండు వీడియోలు చూపించి తను గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ పై నిర్ణయం తీసుకోమని అంటాడు. యావర్ ఆ ఎవిక్షన్ పాస్ తనకు అక్కర్లేదని తిరిగి స్టోర్ రూం లో పెట్టేస్తాడు.

అయితే యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడం వల్ల ఈ వారం ఎలిమినేషన్ ఆగిపోయింది. ఎవిక్షన్ పాస్ తో ఈ వారం ఎలిమినేషన్ చేయిద్దామనుకున్న బిగ్ బాస్ ప్లాన్ మార్చుకునేలా చేశాడు. అసలైతే బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఓటింగ్ ప్రకారం ఉన్న లీస్ట్ టూ లో ఎవరు హౌస్ నుంచి వెళ్లాలన్నది ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అది తిరిగి ఇచ్చేశాడు కాబట్టి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లేదని తెలుస్తుంది.

అసలైతే శనివారం ఈవెనింగ్ శోభా శెట్టి ఎలిమినేషన్ అనే వార్తలు వచ్చినా వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటిసారి నో ఎలిమినేషన్ వీక్ నడుస్తుంది. ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కి లక్ కలిసి వచ్చింది. ఇక ఈ వారం కెప్టెన్ గా ప్రియాంక నిలిచింది. ప్రతిసారి కెప్టెన్సీ కంటెండర్ గా వెళ్లడం చివర్లో ఎక్కడో ఒకచోట వెనక్కి రావడం జరుగుతుంది. కానీ ఈసారి ఆమె కెప్టెన్ గా నిలిచింది.

ప్రియాంక కెప్టెన్ అవడం వల్ల ఆమె కూడా టాప్ 5 రేసులో ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే టాప్ 5 రేసులో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్, యావర్ లు పోటీ పడుతుండగా ప్ర్యాంకా అర్జున్ లకు కూడా ఎక్కడో ఒక ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. చివరి వారం ఓటింగ్ మీదే టాప్ 5 ఎవరన్నది తెలుస్తుంది. ఈలోగా ఎలిమినేట్ అవ్వాల్సిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి రాబోయే 3 వారాల్లో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది.