రీరిలీజ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తున్న సినిమా
అలాంటిది ఏదైనా ఓ సినిమాని రీరిలీజ్ చేసి జనాల్ని థియేటర్లకు రప్పించడం ఎంత పెద్ద సవాల్ గా ఉంటుందో ఊహించగలం
By: Tupaki Desk | 14 Jan 2025 3:30 AM GMTథియేటర్లకు రెగ్యులర్ గా వెళ్లే శక్తి, ఉత్సాహం యువతరంలోనే ఉంటుంది. టెలివిజన్, ఓటీటీలు, యూట్యూబ్ వీడియోల డామినేషన్ కొనసాగుతున్న ఈరోజుల్లో కాస్త నడి వయస్కులు, పెద్దవాళ్లను థియేటర్లకు రప్పించాలంటే కంటెంట్ పరంగా చాలా విషయం ఉంటేనే కానీ సాధ్యపడటం లేదు. అలాంటిది ఏదైనా ఓ సినిమాని రీరిలీజ్ చేసి జనాల్ని థియేటర్లకు రప్పించడం ఎంత పెద్ద సవాల్ గా ఉంటుందో ఊహించగలం.
కానీ ఇటీవల రీరిలీజైన ఓ రెండు సినిమాల వసూళ్లు నిజంగా ఆశ్చర్యపరిచాయి. వీటిలో తుంబాడ్ నంబర్ వన్ గా నిలవగా, రణబీర్ కపూర్ `యే జవానీ హై దీవానీ` సంచలన వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా రెండోసారి విడుదలైంది. విడుదలైన ఎనిమిదవ రోజు కూడా అద్భుత వసూళ్లను సాధించింది. ఇప్పటికే `కహో నా ప్యార్ హై`ని అధిగమించింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన గిల్లీ రీరిలీజ్ కలెక్షన్లను కూడా యే జవానీ హై దివానీ అధిగమించింది. దేశంలో ఇప్పుడు రీరిలీజ్ లలో తుంబాద్ తర్వాత యే జవానీ హై దివానీ రెండో స్థానంలో నిలిచింది. యువ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా సఫలమైంది. విడుదలైన 9 రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 14.45 కోట్లు వసూలు చేసింది. ఆసక్తికరంగా యే జవానీ హై దివానీ 200 కోట్ల క్లబ్‌లో చేరడానికి రీరిలీజ్ సహకరించింది.
తుంబాద్ 1,075,000 టిక్కెట్ల భారీ అమ్మకాలతో నంబర్- 1 స్థానంలో నిలవగా యే జవానీ హై దివానీ ఇప్పుడు 57,000 టికెట్ల అమ్మకాలతో నంబర్ 2 స్థానంలో ఉంది. 53,500 టిక్కెట్ల అమ్మకాలతో గిల్లీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. యే జవానీ హై దివానీ నంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి ఇంకా 88 శాతం ఎక్కువ అమ్మకాలు చేయాల్సి ఉందని విశ్లేషించారు. యువతరానికి కిక్కిచ్చే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనడానికి యే జవానీ హై దివానీ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్.