Begin typing your search above and press return to search.

మహేష్ మేనల్లుడి 'ఏమయ్యిందే' సాంగ్.. మ్యాజికల్ మెలోడీ!

హనుమాన్ మూవీతో సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.

By:  Tupaki Desk   |   3 May 2024 7:23 PM GMT
మహేష్ మేనల్లుడి ఏమయ్యిందే సాంగ్.. మ్యాజికల్ మెలోడీ!
X

'హీరో' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ మూవీతో సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.


కొన్ని రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ నెట్టింట ఫుల్ వైరల్ అయింది. యూనిక్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ అవతార్ లో అశోక్ గల్లా సందడి చేయనున్నారు. రీసెంట్ గా అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఫస్ట్ సింగిల్ 'ఏమయ్యిందే' ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా 'ఏమయ్యిందే' ఫుల్ లిరికల్ సాంగ్ ను శుక్రవారం రిలీజ్ చేశారు మేకర్స్. మెలోడియస్ సాంగ్ వినండంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. 'ఏమయ్యిందే' అంటూ సాగుతున్న ఈ సాంగ్.. అశోక్ గల్లాకు తన లవర్ (హీరోయిన్) పై ఉన్న ప్రేమను వివరిస్తోంది. ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, మానస అందంగా ఆకట్టుకుంటోంది. వీరి జోడీ సాంగ్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది.

ఇటీవల కాలంలో అనేక చార్ట్‌ బస్టర్ ఆల్బమ్స్ అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో.. ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. సురేష్ గంగుల రాసిన సూపర్ లిరిక్స్ కు ఈశ్వర్ దత్తు ప్రాణం పోశారు. సాంగ్ లో విజువల్స్ రిచ్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పాట ఆకట్టుకుంటోందని, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉందని చెబుతున్నారు. 'ఏమయ్యిందే' సాంగ్ పెర్ఫెక్ట్ మ్యాజిక్ మెలోడీ అని అంటున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. లలితాంబిక ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ ఆర్‌ ఐ సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ తో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.