అబ్బాయిలు మీరు మారాల్సిందే!
దీంతో అతడి లో మార్పు మొదలైందని కొందరంటుంటే? అది మార్పు కాదు....సోలో హీరోగా ఛాన్సులు లేకపోవడంతో అలా కమిట్ అవ్వాల్సి వచ్చిందన్నది మరికొంత మంది వాదన.
By: Tupaki Desk | 25 Oct 2023 5:30 PM GMTటాలీవుడ్ లో ఆ నలుగురు..ముగ్గురు యంగ్ హీరోలు మారాల్సిన సమయం ఆసన్నమైందా? అంటే అవుననే వినిపిస్తుంది. అందులో ఓ హీరో సాహసం అనుకుని చేతులు కాల్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే ఓ భారీ సాహసానికి పూనుకున్నాడు. కానీ ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశని మిగిల్చింది. సినిమాలో విషయం ఏదైనా ఉందా? ఏమీ ఉండదు. రిలీజ్ కి ముందు హడావుడి తప్ప! రిలీజ్ తర్వాత మ్యాటర్ లేని సినిమా అని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అసలు ఆ సినిమా ఎందుకు చేసాడో? ఆ హీరోకైనా తెలుసా? అన్నంతగా నెగిటివిటీ తెరపైకి వచ్చింది. అందకుముందు విజయాలు ఏదైనా ఉన్నాయా? అంటే భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. సోసోగా ఆడిన చిత్రాలు తప్ప....పేరు తెచ్చిన చిత్రాలేవి లేదు. ఓ హీరో పరిస్థితి ఇలా ఉంటే మరో కుర్ర హీరో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించడం లేదు.
కానీ కెరీర్ లో సినిమా సంఖ్య మాత్రం బాగా పెరుగుతుంది. అందులో విజయాలు ఎన్ని అని లెక్క వేస్తే..ఎక్కడా విజయం కనిపిచలేదు. ఈ విషయంలో ఈ హీరో మరో యంగ్ హీరోని కాపీ కొట్టినట్లు అనిపించింది. ఇతగాడి ఎంట్రీకి ముందు అదే వరుసలో మరో యంగ్ హీరో వెళ్లేవాడు. వచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడం తప్ప! అందులో హిట్ ఉందా? లేదా? అని ఏనాడు ఆలోచించింది లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆయంగ్ హీరోలో కాస్త ఛేంజ్ కనిపిస్తుంది.
ఇతర స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు ఒప్పుకుంటున్నాడు. దీంతో అతడి లో మార్పు మొదలైందని కొందరంటుంటే? అది మార్పు కాదు....సోలో హీరోగా ఛాన్సులు లేకపోవడంతో అలా కమిట్ అవ్వాల్సి వచ్చిందన్నది మరికొంత మంది వాదన. ఈ వాదనలన్ని పక్కనబెడితే ఆ యంగ్ హీరోలు మాత్రం ఇక మారాల్సిన సమయం వచ్చేసింది అన్నది వాస్తవం. ఇంకా మూస మార్గంలో సినిమాలు చేస్తే అవకాశాలే కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.
ఇక్కడే ఓ డౌట్ కూడా రెయిజ్ అవుతుంది. మంచి సినిమా అనుకుని పొరపాటుతో తప్పు జరుగుతుందా? లేక వాళ్ల నాలెడ్జ్ అంతవరకే పరిమితమా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మాటలు కోటలు దాటడం తప్ప ..తమవరకూ వచ్చే సరికి సరైన కథలు ఎంచుకోవడంలో వైఫల్యం చెందుతున్నట్లు కనిపిస్తుందని కొందరంటున్నారు.