Begin typing your search above and press return to search.

అమ్మడి అందాలకు ఎలాంటోడైనా పాగల్ అవ్వాల్సిందే..!

ఈ నగరానికి ఏమైంది, పాగల్ రెండు విశ్వక్ సేన్ సినిమాల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించింది సిమ్రన్ చౌదరి.

By:  Tupaki Desk   |   31 Jan 2024 5:49 AM GMT
అమ్మడి అందాలకు ఎలాంటోడైనా పాగల్ అవ్వాల్సిందే..!
X

మోడల్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారిన తెలుగు అమ్మాయి సిమ్రన్ చౌదరి 2014లో వచ్చిన హం తుం సినిమాతో తెరంగేట్రం చేసినా 10 ఏళ్లలో ఆరు సినిమాలు మాత్రమే చేసింది. మోడలింగ్ తో పాటు సినిమాల మీద ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు హం తుం మొదలు కుని ఈ నగరానికి ఏమైంది, బొంబాత్, చెక్, పాగల్, సెహరి సినిమాల్లో నటించింది. ఈ నగరానికి ఏమైంది, పాగల్ రెండు విశ్వక్ సేన్ సినిమాల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించింది సిమ్రన్ చౌదరి.


సినిమాల్లో తనకు ఇచ్చిన పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న అమ్మడికి స్టార్ ఛాన్స్ లు మాత్రం రావట్లేదు. ఇక సినిమాల లెక్క ఎలా ఉన్నా సిమ్రన్ సోషల్ మీడియా హంగామా మాత్రం ఒక రేంజ్ లో కొనసాగుతుంది. తన క్రేజీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది సిమ్రన్ చౌదరీ. లేటెస్ట్ గా తన లుక్స్ తో మరోసారి అందరినీ అలర్ట్ చేసింది. ఖాకీ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ తో గ్లామర్ డోస్ పెంచేసింది అమ్మడు.


తన ఫాలోవర్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు లేటెస్ట్ ఫోటో షూట్ తో క్రేజీ లుక్స్ తో అలరిస్తుంది సిమ్రన్. తనలోని ఈ హా**ట్ యాంగిల్ ఎవరు వాడుకోవట్లేదు కానీ ఇదే క్రేజీ అటెంప్ట్ సినిమాల్లో చేస్తే మాత్రం స్టార్ హీరోయిన్స్ కూడా సైడ్ అయ్యే రేంజ్ కి అమ్మడు వెళ్లడం గ్యారెంటీ. చేస్తున్న సినిమాలు.. సోషల్ మీడియా ఫాలోవర్స్ చాలకుని సైలెంట్ అవుతుంది కానీ అదే సిమ్రన్ రెచ్చిపోవడం మొదలు పెడితే తన తర్వాతే ఎవరైనా అన్న రేంజ్ లో ఉంది.


చేసిన సినిమాలు తక్కువే అయినా సిమ్రన్ ని తెలుగు ప్రేక్షకులు అభిమానిస్తున్నారు. అయితే ఆమె సినిమాల వేగం పెంచి మరిన్ని సినిమాలు చేస్తే ఆ క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా తనలోని ఈ గ్లామర్ యాంగిల్ సినిమాల్లో ట్రై చేస్తే మాత్రం నెక్స్ట్ బిగ్ స్టార్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి సిమ్రన్ కావాలని సినిమాల్లో గ్లామర్ షో వద్దనుకుంటుందా లేదా అలాంటి ఆఫర్లు రావట్లేదా అన్నది తెలియదు కానీ సిమ్రన్ చౌదరి ఫాం లోకి వచ్చి వరుస సినిమాలు చేయాలని కోరుతున్నారు ఆమె ఫాలోవర్స్.