Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల బాట‌లోనే జూనియ‌ర్లు!

సినిమా అనే వ్యాపారం రిస్క్ తో కూడుకున్న‌ద‌ని అనుభ‌వ‌జ్ఞులైన నిర్మాత‌లు ఎప్పుడూ చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   13 March 2025 12:13 PM IST
సీనియ‌ర్ల బాట‌లోనే జూనియ‌ర్లు!
X

సినిమా అనే వ్యాపారం రిస్క్ తో కూడుకున్న‌ద‌ని అనుభ‌వ‌జ్ఞులైన నిర్మాత‌లు ఎప్పుడూ చెబుతుంటారు. పెట్టుబ‌డి పెట్టే ముందు ఆచితూచి పెట్టాల‌ని చెబుతుంటారు. పెరిగిన నిర్మాణ వ్య‌యంతో సినిమా తీయ‌డం భారంగా మారింద‌ని ఇప్ప‌టికే నిర్మాత‌లు ల‌బోదిబో మంటోన్న సంగ‌తి తెలిసిందే. సురేష్ బాబు లాంటి సీనియ‌ర్ నిర్మాత ఇప్ప‌టికే నిర్మాణం బాగా త‌గ్గించేసిన సంగ‌తి తెలిసిందే.

మిగ‌తా సీనియ‌ర్ నిర్మాత‌లంతా సినిమాలు తీసినా? అది ఎంతో ప‌క‌డ్భందీగా జ‌రుగుతోంది. అలాగే స్టార్ హీరోలు కూడా నిర్మాణ రంగంలో పెట్టుబ‌డుడు పెడుతున్నారు. మ‌రికొంత మంది డైరెక్ట‌ర్లు కూడా ఇక్క‌డ సంపాదించింది ఇక్కడే పెట్టుబ‌డి పెట్టాల‌ని సొంత బ్యాన‌ర్లు స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు కూడా ఈవిషయంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

యంగ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల `ద‌స‌రా`తో ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. అత‌డు తీసింది ఒక్క సినిమానే. కానీ ఇంత‌లోనే సొంత బ్యాన‌ర్ స్థాపించాడు. స‌మ్మ‌క్క సారక్క క్రియేష‌న్స్ బ్యాన‌లో `గులాబీ` అనే సినిమా నిర్మిస్తున్నాడు. అలాగే అజ‌య్ భూప‌తి `మంగ‌ళ‌వారం` సినిమా నుంచి ఆయ‌నా నిర్మాత‌గా మారాడు. ఏ క్రియేటివ‌ర్క్స్ పై ఆ చిత్రాన్ని నిర్మించాడు. `మంగ‌ళ‌వారం 2` కూడా అదే బ్యాన‌ర్లో నిర్మిస్తున్నాడు.

ఇంకా `క‌ల్కి 2898`తో పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మైన నాగ్ అశ్విన్ కూడా కొత్త కాన్సెప్ట్ ల‌ను నిర్మిం చ‌డంలో ముందుంటున్నాడు. `జాతిర‌త్నాలు` నిర్మించింది అత‌డే. అలాగే సందీప్ వంగ `అర్జున్ రెడ్డి` తొలి సినిమాతోనే దర్శ‌క‌, నిర్మాత‌గా మారాడు. అటుపై `యానిమ‌ల్` చిత్రాన్ని కూడా మ‌రో నిర్మాత‌తో క‌లిసి భ‌ద్ర‌కాళి మూవీస్ లో నే నిర్మించారు. ఇంకా సంప‌త్ నంది కూడా నిర్మాత‌గా రాణిస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా సినిమాలు త‌గ్గిన నేప‌థ్యంలో తెలివిగా కొత్త కాన్సెప్ట్ ల‌ను నిర్మిస్తూ లాభాలు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తో `ఓదెల‌2` ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.