పవన్ ఫాంలో ఉన్నంత కాలమేనా ఈ బ్రాండ్!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు ఆయన ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు వివిధ రూపాల్లో హైలైట్ అవుతుంటాయి.
By: Tupaki Desk | 10 Feb 2025 10:30 AM GMTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు ఆయన ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు వివిధ రూపాల్లో హైలైట్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ ను వినియోగించుకున్న హీరోలు కొంత మంది ఉన్నారు. మెగా వారసుడు వరుణ్ తేజ్ పవన్ నటించిన `తొలి ప్రేమ` టైటిల్తో ఓ సినిమా చేసి సక్సస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వరుణ్ కెరీర్ లో పీల్ గుడ్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ కూడా పవన్ `ఖుషీ` టైటిల్తో ఓ సినిమా చేసి యావరేజ్ సక్సెస్ అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రమిది. మ్యూజికల్ గా సినిమా మంచి విజయం సాధించింది. ఇంకా పవన్ మ్యానరిజమ్ , డైలాగు డిక్షన్ ని అనుసరించి ఫేమస్ అయిన నటులు చాలా మంది ఉన్నారు. ఈనేపథ్యంలో తాజాగా పవన్ సినిమా టైటిల్స్ తో మరింత మంది ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే పవన్ కి డైహార్డ్ ఫ్యాన్ గా నితిన్ ఫేమస్. పవన్ టైటిల్ `తమ్ముడు` పేరుతో నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా యంగ్ హీరో శర్వనంద్ కూడా పీకే టైటిల్తో నే ఓ సినిమా చేసే యోచనలో ఉన్నాడు. అదే `జానీ`. ఇదే టైటిల్ తో శర్వా సినిమా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జానీ టైటిల్ ని యూవీ క్రియేషన్స్ పరిశీలిస్తోంది. అలాగే యాంకర్ ప్రదీప్ కూడా` అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి` టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇది పవన్ కళ్యాణ్ తొలి సినిమా టైటిల్ అన్న సంగతి తెలిసిందే. ఆసినిమా పవన్ కి డెబ్యూగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇవన్నీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రాలు. అయితే పవన్ బ్రాండ్ అన్నది అతడు సినిమాల్లో కొనసాగినంత కాలమే కనిపిస్తుంది. ఆయన పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయితే ? ఆయన సినిమా టైటిల్స్ వాడుకున్నా అంత ఇంపాక్ట్ ఉండదు. అందుకే ఇలా యంగ్ హీరోలంతా పవన్ ఫాంలోఉన్నప్పుడే ఆయన బ్రాండ్ ని వాడాలని యంగ్ హీరోలంతా బలంగా ఫీక్సైనట్లు కనిపిస్తుంది.