Begin typing your search above and press return to search.

త‌మ‌న్నాను పెళ్లికి ఆహ్వానించిన ఫోటోగ్రాఫ‌ర్

త‌న‌కు పెళ్లి కుదిరింద‌ని ఆ యువ ఫోటోగ్రాఫ‌ర్ ఎంతో ఉత్సాహంగా త‌మ‌న్నాతో చెప్ప‌డంతో శుభాకాంక్ష‌లు తెలిపిన త‌మ‌న్నా, అతడి పెళ్లికి వస్తాన‌ని మాటిచ్చింది.

By:  Tupaki Desk   |   20 Dec 2024 5:32 PM GMT
త‌మ‌న్నాను పెళ్లికి ఆహ్వానించిన ఫోటోగ్రాఫ‌ర్
X

ఓవైపు త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ జంట ప్రేమాయ‌ణం గురించి ముంబై మీడియా ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తోంది. మ‌రోవైపు త‌మ‌న్నా బిజీ షెడ్యూళ్ల‌ను మ్యానేజ్ చేస్తూ దేశంలోని ప‌లు న‌గ‌రాల‌కు ప్ర‌యాణిస్తోంది. న‌ట‌నా కెరీర్‌పై ఫోక‌స్ చేస్తూనే, వ్య‌క్తిగ‌త జీవితంలో ల‌వ్ లైఫ్ పైనా దృష్టి సారించింది త‌మ‌న్నా. ఇటీవ‌ల సౌత్ కి దూర‌మైనా కానీ, హిందీ చిత్ర‌సీమ‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల‌తో బిజీ అవుతోంది.

ఇంత‌కుముందు త‌న స్నేహితుడు విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి కొన్ని వెబ్ సిరీస్ ల‌లో నటించింది. 2024లో స్త్రీ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో ప్ర‌త్యేక గీతంతో మ‌రోసారి ఫ్యాన్స్ ని అల‌రించింది. మ‌రోవైపు త‌మ‌న్నా ఒకేసారి మూడు సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉంది. త‌దుప‌రి 'వేద' అనే చిత్రంలో న‌టిస్తోంది. నీర‌జ్ పాండే సిరీస్ 'సికంద‌ర్ కా ముఖ‌ద్ద‌ర్' లోను కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. 'ఓదెలా 2' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ నిరంత‌రం బిజీగా ఉన్న త‌మ‌న్నా ఇటీవ‌ల విమానాశ్ర‌యం నుంచి వెళుతుంటే త‌న‌ను క‌లిసిన ఓ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ పెళ్లికి ఆహ్వానించాడు.

త‌న‌కు పెళ్లి కుదిరింద‌ని ఆ యువ ఫోటోగ్రాఫ‌ర్ ఎంతో ఉత్సాహంగా త‌మ‌న్నాతో చెప్ప‌డంతో శుభాకాంక్ష‌లు తెలిపిన త‌మ‌న్నా, అతడి పెళ్లికి వస్తాన‌ని మాటిచ్చింది. అన్న‌ట్టు త‌న‌ను ఆహ్వానించిన స‌ద‌రు ఫోటోగ్రాఫ‌ర్ ని తిరిగి త‌మ‌న్నా కూడా గుర్తు పెట్టుకుని త‌న పెళ్లికి ఆహ్వానిస్తుందో లేదో చూడాలి. విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా పెళ్లి ఎప్పుడు? అన్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్ గా మారింది.