అక్కడ కాక పుట్టిస్తోన్న కుర్రాళ్ల త్రయం!
ఇంతలో ఈ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు బ్లాక్ బస్టర్లు కొట్టి మార్కెట్ రేంజ్ ని పెంచేస్తున్నారు.
By: Tupaki Desk | 8 Sep 2023 5:30 PM GMTసీనియర్లు పోయే..జూనియర్లు వచ్చే..సత్తా చాటెన్ అన్నట్లు ఉంది కోలీవుడ్లో పరిస్థితి. ఇటీవలే 'జైలర్' హిట్ తో సూపర్ స్టార్ కి బ్లాక్ బస్టర్ అందించాడు నెల్సన్ దిలీప్ కుమార్. అంతకు ముందు నెల్సన్ తెరకెక్కిం చిన 'బీస్ట్' ప్లాప్ అయినా 'జైలర్' తో అన్ని లెక్కలు సరిచేసాడు. సూపర్ స్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చిత్రంగా 'జైలర్' నిలిచింది. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది.
ఆ చిత్ర నిర్మాత కళ్లలో కోట్ల ఆనందం నింపారు. ప్రతిగా నిర్మాత భారీగా అదనపు పారితోషికాలు. కార్లు..విల్లాలు బహుమతులుగా ఇచ్చారు. ఇదంతా జరిగిందంటే? కారణం దర్శకుడు నెల్సన్. అతని ప్రతిభ..రజనీ ఇమేజ్ తోనే ఇది సాధ్యమైంది. తాజాగా అట్లీ నుంచి రిలీజ్ అయిన జవాన్ కూడా మోతెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా నటించిన సినిమా మొదటి రోజు ఏకంగా 150 కోట్ల వసూళ్లని సాధించింది.
ఇది ఇండియన్ సినిమా రికార్డు. ఆ రకంగా షారుక్-అట్లీ కెరీర్ లోనూ ఓ చరిత్ర అనే చెప్పాలి. ఇప్పటి వరకూ అట్లీకి పరాజయమే లేదు. చేసిన సినిమాలన్నీ భారీ విజయాలే. ఈసారి జవాన్ తో అంతకు మించి సంచలనం సాధించాడు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది. అట్లీ తో సినిమా చేయడానికి ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు క్యూలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టాలీవుడ్..బాలీవుడ్ హీరోలో లైన్ లో ఉంటారు. వీళ్లిద్దరి కంటేముందే సంచలనమైన మరో పేరు లోకేష్ కనగరాజ్. 'ఖైదీ'..'విక్రమ్' విజయాలతో తనకంటూ ఓ యూనిక్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే లోకేష్ తో సినిమాలు చేయడానికి లైన్ లో ఉన్నారు. లియో తో హ్యాట్రిక్ అందుకుంటే ఆ జాబితా రెట్టింపు అవుతుంది. కోలీవుడ్ లో ఈ ముగ్గురు యువ దర్శకులు హాట్ టాపిక్ అనే చెప్పాలి. సీనియర్లు అంతా సక్సెస్ లేక వెయిట్ చేస్తున్నారు.
ఇంతలో ఈ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు బ్లాక్ బస్టర్లు కొట్టి మార్కెట్ రేంజ్ ని పెంచేస్తున్నారు. సీనియర్లు సూపర్ స్టార్లతో ఏ సినిమాచేసినా అంతకు మించి ఘనత సాధించాలి. లేదంటే రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది.