సలార్ : 100 టికెట్లతో మిడ్ నైట్ షోకి యంగ్ హీరో రెడీ
డిసెంబర్ 21న అర్థరాత్రి 1 గంట కి సలార్ శ్రీరాములు థియేటర్ లో ఆట మొదలు అవ్వబోతుంది.
By: Tupaki Desk | 16 Dec 2023 11:01 AM GMTసినీ ప్రేక్షకులతో పాటు, సినీ స్టార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'సలార్'. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. డిసెంబర్ 21న అర్థరాత్రి 1 గంట కి సలార్ శ్రీరాములు థియేటర్ లో ఆట మొదలు అవ్వబోతుంది.
శ్రీరాములు థియేటర్ లో సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ తాను శ్రీరాములు థియేటర్ లో అర్థరాత్రి 1 గంట షో కి హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. అంతే కాకుండా ఆ షో కి తాను 100 టికెట్లను ప్రభాస్ అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు.
పదేళ్ల క్రితం మిర్చి సినిమా ను అదే శ్రీరాములు థియేటర్ లో అర్థరాత్రి షో చూశాను. ఇప్పుడు మళ్లీ వంద మంది ప్రభాస్ అభిమానులతో కలిసి సలార్ సినిమాను చూడబోతున్నాను అన్నట్లుగా ట్విట్టర్ లో ప్రకటించాడు. హీరో నిఖిల్ చేసిన ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రభాస్ పై ఉన్న అభిమానంతో నిఖిల్ ఏకంగా వంద టికెట్లను ఫ్యాన్స్ కి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కేవలం నిఖిల్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది యంగ్ హీరోలు కూడా ఎప్పుడెప్పుడు సలార్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ మాదిరిగా ఆసక్తిగా ఉన్నారు.
కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో సలార్ పై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.