యంగ్ టైగర్ 9999 సీక్రెట్ అదా?
కానీ ఏ కారుకి లేని ప్రత్యేకత తారక్ కారుకి 9999 నెంబర్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మరి తారక్ ఈ నెంబర్ ని ఎందుకంత ఇష్టపడతాడు
By: Tupaki Desk | 14 Sep 2023 6:04 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ కారు కొనుగోలు చేసినా తప్పకుండా ఆ కారు నెంబర్ 9999 తప్పనిసరి. ఆయన తొలి కారు నుంచి ఇప్పటివరకూ ఈ నెంబర్ లేని కారుండదు. ఖరీదైనా కారైనా..ధర తక్కువ కారైనా సరే తప్పక 9999 నెంబర్ ఉండాల్సిందే. ఆ రకంగా యంగ్ టైగర్ టాలీవుడ్ లో చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ ఆయనకే ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఖరీదైన కార్లు వాడుతున్నారు.
కానీ ఏ కారుకి లేని ప్రత్యేకత తారక్ కారుకి 9999 నెంబర్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మరి తారక్ ఈ నెంబర్ ని ఎందుకంత ఇష్టపడతాడు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉందని తెలుస్తోంది. తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఇదే నెంబర్ గల కార్లు ఉండేవట. ఇక కార్లకు రధ సారధి ఎవరు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లలన్నా కుమారుడే కారు డ్రైవింగ్ చేసేవారు.
రాజకీయ సమావేశాల్లో సైతం వేల మైళ్లు నడిపిన ఘతన హరికృష్ణది. ఆయనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రికి డ్రైవర్ గా ఉంటే తప్పేముందని చెప్పిన సందర్బాలెన్నో. ఇలా నాన్న వాహనాన్ని తాను నడపడం ఎంతో గర్వం గా ఫీలయ్యేవారు. ఆ తర్వాత అదే నంబర్ గల కార్లను హరికృష్ణ వినియోగిం చేవారు. అలా తండ్రీ కొడుకులిద్దరికి 9999 నెంబర్ ఓ సెంటిమెంట్ గా మారిపోయింది.
వాళ్ల సెంటిమెంట్ ని కొనసాగిస్తూనే తారక్ కూడా అదే నెంబర్ గల కార్లను వాడుతున్నారు. ఇక యాదృశ్చికం ఏంటంటే? సింగిల్ నెంబర్ తొమ్మిది అంటే తారక్ కి ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టపడుతున్నాడుట. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత అదే నెంబర్ గల కార్లను తాత..తండ్రి కూడా వినియోగించడంతో ఆ సెంటిమెంట్ ని యాధా విధిగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి 1111 ఇదే నెంబర్ గల కార్లని వినియోగిస్తుంటారు. ఆయన లక్కీ నెంబర్ 4 అందుకే ఇలా నాలుగు ఒకట్లు ఉండే నెంబర్ ని తీసుకున్నారు. ఆయనకు ఉన్న రోల్స్ రాయల్స్ కారు నెంబర్ కూడా ఇదేనని తెలుస్తోంది. అలా తారక్..చిరంజీవి 9..1 నెంబర్లతో ఫ్యాన్స్ లోనూ క్రేజీగా మారుతున్నారు.