YRF స్పై యూనివర్స్ లోగోతో రణభేరి
బాండ్ 007 .. మిషన్ ఇంపాజిబుల్.. బార్న్ ఫ్రాంఛైజీలు హాలీవుడ్ లో స్పై యాక్షన్ కేటగిరీలో భారీతనంతో అలరించాయి.
By: Tupaki Desk | 29 Sep 2023 9:08 AM GMTబాండ్ 007 .. మిషన్ ఇంపాజిబుల్.. బార్న్ ఫ్రాంఛైజీలు హాలీవుడ్ లో స్పై యాక్షన్ కేటగిరీలో భారీతనంతో అలరించాయి. ఇప్పుడు అదే తరహాలో యష్ రాజ్ ఫిలింస్ భారీ స్పై యూనివర్శ్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. టైగర్ - వార్ - పఠాన్ లను కలుపుతూ స్పై యూనివర్శ్ కథలతో భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలను యష్ రాజ్ బ్యానర్ నిర్మించనుంది.
ఆసక్తికరంగా ఈ బ్యానర్ నుంచి తదుపరి వార్ 2 - టైగర్ 3 విడుదలకు సిద్ధమవుతుండగా, వీటి ప్రోమోలతో స్పై యూనివర్శ్ లోగోని ఎటాచ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. టైగర్ 3 టీజర్ ఇప్పటికే రిలీజై అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ఈ టీజర్ కి లోగోను ఎటాచ్ చేయడం ఉత్కంఠను పెంచింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా ఏక్ థా టైగర్ (2012) -టైగర్ జిందా హై (2017) తర్వాత ఈ ఫ్రాంఛైజీలో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా వస్తోంది. ఇది YRF స్పై యూనివర్స్‌లో కొత్త సినిమా. హృతిక్ రోషన్ నటించిన వార్ (2019) .. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (2023) కూడా ఇందులో ఒక భాగం.. నిజానికి పఠాన్‌లో సల్మాన్ టైగర్ పాత్రలో కనిపించాడు. సల్మాన్ - SRK కలిసి ఉన్న సన్నివేశాలు సినిమా కలెక్షన్లను పెంచడంలో గొప్ప పాత్రను పోషించాయి. ఇప్పుడు షారుఖ్ పఠాన్ పాత్ర టైగర్ 3 వసూళ్లను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా యాక్షన్ ఎంటర్ టైనర్ `టైగర్ 3` 2023లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఫ్రాంచైజీ మునుపటి చిత్రాల ట్రైలర్లలో YRF స్పై యూనివర్స్ లోగో మిస్సయింది. ఏక్ థా టైగర్- టైగర్ జిందా హై- వార్ చిత్రాలకు ఈ లోగోని ఉపయోగించలేదు. కానీ లోగోను విడిగా ఈ సంవత్సరం ఆరంభంలోనే ప్రపంచానికి ఆవిష్కరించగా గొప్ప స్పందన లభించింది. జనవరి 10న విడుదలైన పఠాన్ ట్రైలర్‌లో మొదటిసారి ఎటాచ్ చేసి కనిపించింది. దీని అర్థం విశ్వం (యూనివర్శ్)లో మునుపటి సినిమాలతో పోలిస్తే ఇకపై రాబోయేవి అతి భారీ చిత్రాలు అన్న హింట్ ఇచ్చినట్టయింది. మల్టీస్టారర్ కేటగిరీలో భారీ స్పై యాక్షన్ సినిమాలకు తెరలేపుతున్నామని యష్ రాజ్ బ్యానర్ చెప్పకనే చెప్పింది. ఇకపోతే యష్ రాజ్ బ్యానర్ స్పై యూనివర్శ్ సినిమాల గత ట్రైలర్‌లు ఈ లోగో లేకుండానే విడుదలయ్యాయి. ఇప్పుడు YRF YouTubeలో స్పై యూనివర్స్ లోగోతో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై- వార్ ట్రైలర్‌లను తెలివిగా అప్‌డేట్ చేసింది.
నిజానికి YRF స్పై యూనివర్స్ లోగో ఒక సూపర్ హిట్ ఐడియా అని అభిమానులు భావిస్తున్నారు. తొలిసారి `పఠాన్` సినిమాలో ప్రదర్శించగా ప్రేక్షకులు దేశంలోని పెద్ద సూపర్‌స్టార్‌లతో భారీ సిరీస్‌ని చూడబోతున్నామని భావించారు. థియేటర్లు విజిల్స్ తో మార్మోగాయి. ఆసక్తికరంగా స్వంత లోగోతో భారతీయ సినిమా ఏకైక విశ్వంగా ఇది రికార్డులకెక్కుతోంది. టైగర్ 3 విషయానికి వస్తే...సల్మాన్ కథానాయకుడిగా, షారూఖ్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాకి మనీష్ శర్మ-దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది 2023 దీపావళికి విడుదల కానుంది.