అద్దె లొల్లు: ఇంటి యజమానిపై సంగీత దర్శకుడు దావా
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ స్వరకర్త యువన్ శంకర్ రాజా ప్రస్తుతం న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు
By: Tupaki Desk | 19 Aug 2024 8:46 AM GMTసౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ స్వరకర్త యువన్ శంకర్ రాజా ప్రస్తుతం న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని నుంగంబాక్కంలో జమీలా అనే మహిళ నుంచి ఇంటిని అద్దెకు తీసుకున్న అతడిపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 20 లక్షల అద్దె బకాయిలు చెల్లించడంలో విఫలమయ్యాడంటూ యువన్ శంకర్ రాజాపై జమీలా సోదరుడు మహ్మద్ జావిద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమానికి తెలియజేయకుండా యువన్ ఆకస్మికంగా ఖాళీ చేసి ఇంటికి నష్టం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. అద్దె చెల్లింపు ఎగవేత సహా అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేసినందున నష్టపరిహారం కోసం యువన్ శంకర్ రాజాపై చట్టపరమైన చర్యలకు జావిద్ ప్రయత్నించారు. అయితే ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా యువన్ శంకర్ రాజా ప్రతి కౌంటర్ దాఖలు చేసారు. ఇంటి యమజాని వాదనలను ఖండించారు. జావిద్ కళంకం కలిగించడానికి తప్పుడు ప్రకటనలు చేశారని యువన్ ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదుకు రూ. 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువన్ ఇంటి యజమాని జావిద్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ న్యాయ పోరాటం చలనచిత్ర పరిశ్రమలో ప్రజల దృష్టిని ఆకర్షించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. యువన్ తమిళ సినీపరిశ్రమలో బిజీ సంగీత దర్శకుడు. GOAT ట్రైలర్‌కి యువన్ శంకర్ రాజా ఇటీవల అందించిన సంగీతం గొప్ప ప్రశంసలను అందుకుంది. ఎనర్జిటిక్ కంపోజర్ గోట్ కోసం అద్భుతమైన ట్రాక్‌ని అందించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ప్రమోషనల్ వీడియో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. అభిమానులలో ఉత్సాహం పెంచింది.