చాహల్‌తో డేట్.. శుభ్‌మాన్‌పై క్రష్.. ఆర్జే మహ్వాష్ ముక్కోణ ప్రేమకథ!
అయితే ఈ డ్రామాలో ఇప్పుడు మరో కొత్త ట్విస్టు. మహ్వాష్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో సన్నిహితంగా ఉన్న ఓ వీడియో వైరల్ గా మారుతోంది.
By: Tupaki Desk | 13 March 2025 11:18 PM ISTఛాంపియన్స్ ట్రోఫీ- 2025 ఫైనల్ సాక్షిగా, యుజ్వేంద్ర చాహల్ - ఆర్జే మహవాష్ జంట సాన్నిహిత్యం కెమెరా కళ్లకు చిక్కడం దుమారం రేపింది. ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం చూశాక జంట చాలా జోరుగా ఉందంటూ ప్రచారం సాగింది. కానీ ఈ పుకార్లను మహవాష్ ఖండించారు. చాహల్ ఓవైపు తన భార్య ధనశ్రీకి విడాకులు ఇస్తున్నాడనే పుకార్ల నడుమ సడెన్ గా అందమైన ఆర్జేతో స్టేడియంలో ప్రత్యక్షం కావడం కొందరిని కలవరపాటుకు గురి చేసింది. భార్య అలిగి వెళ్లినప్పుడు ఆమెలో చలనం రావాలంటే, పర స్త్రీతో కవ్వించాలనే ఫార్ములాను చాహల్ అనుసరించాడని నెటిజనులు బావించారు. ఇది చాహల్ చిలిపి పనిని బయటపెట్టింది.
చాహల్ విడాకుల డ్రామా మధ్య నెటిజన్లు మహవాష్ గురించి ఎంక్వయిరీ చేయడం ఆసక్తిని కలిగించింది. ఫైనల్లో భారత్ గెలిచాక భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ జంట వివేక్ ఒబెరాయ్‌తో పార్టీకి కూడా అటెండయ్యారు. వారంతా ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాధిస్తూ కనిపించారు. అప్పటి నుండి వారిపై చాలా చర్చ సాగింది.
అయితే ఈ డ్రామాలో ఇప్పుడు మరో కొత్త ట్విస్టు. మహ్వాష్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో సన్నిహితంగా ఉన్న ఓ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ త్రోబ్యాక్ వీడియోలో మహ్వాష్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌పై తన క్రష్ గురించి బయటపెట్టింది. అతడితో వన్ సైడ్ లవ్‌లో ఉన్నానని మహ్‌వాష్ వ్యాఖ్యానించింది. అయితే ఈ వీడియోలో ఆర్జే ఎంతో సరదాగా ఉత్సాహంగా కనిపించింది. వీడియోలో ఆర్జే మహ్వాష్ శుభ్‌మాన్ గిల్‌ను కలుసుకుని, అతనిపై తన వన్ సైడ్ లవ్‌ను శాశ్వత బంధంగా వికసించేలా మాయాజాలం చేయడానికి ప్రయత్నించింది. ఈ వీడియో అక్టోబర్ 2029లో పోస్ట్ చేయగా, ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. చాహల్- మహ్‌వాష్- శుభ్ మాన్ ట్రయాంగిల్ లవ్ స్టోరి బావుంది! అంటూ యూత్ సరదాగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.