స్త్రీలను తప్పుబట్టడం ట్రెండ్ అయిపోయింది: ధన శ్రీ
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోయినా కప్ గెలిచిన భారత జట్టు సభ్యులతో సమానంగా సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అవుతున్నాడు.
By: Tupaki Desk | 11 March 2025 9:59 AMటీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోయినా కప్ గెలిచిన భారత జట్టు సభ్యులతో సమానంగా సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అవుతున్నాడు. దీనికి ముఖ్య కారణం ఆదివారం ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఈ క్రికెటర్ తన స్నేహితురాలు, రేడియో జాకీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సెర్ మహ్‌వష్‌తో కలిసి మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వచ్చాడు.
దీంతో ధనశ్రీ వర్మతో చాహల్‌కు విడాకులు అయిపోయాయని, అందుకే మహ్‌వష్‌తో కలిసి మ్యాచ్ చూడడానికి వచ్చాడని సోషల్ మీడియా కోడై కూసింది. వీరిద్దరు సన్నిహితంగా, నవ్వూతూ పలుమార్లు ఈ మ్యాచ్ లైవ్‌లో కనపడడంతో చాహల్ కొత్త లవ్ స్టోరీ మొదలైందని, వారు ఇరువురూ కలిసి మ్యాచ్ చూస్తున్న ఫొటోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం వీరి విడాకుల కేసు ముంబైలోని బాంద్రా కోర్టులో నడుస్తుందని, భరణంగా ధనశ్రీ వర్మ రూ.60 కోట్లు అడిగినట్టు జాతీయ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఒక పక్క చాహల్-మహ్‌వష్ ఫొటోలు వైరలవడం, మరో వైపు ఈ భరణం వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరలవడంతో ధనశ్రీ వర్మ ఇన్‌స్టాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టింది. ఏ విషయంలోనైనా స్త్రీలను తప్పుబట్టడం ట్రెండ్ అయిపోయిందని ఆమె పోస్టు చేసింది.
ఈ పోస్టుకు ముందు గతంలో చాహల్‌తో ఉన్న ఫొటోలను హైడ్ చేసిన ధనశ్రీ వర్మ వాటిని తిరిగి అన్ హైడ్ చేసింది. అయితే ఇప్పటివరకు చాహల్-ధనశ్రీ వర్మ నుంచి విడాకులపై అధికారిక ప్రకటన రాలేదు. వీరి తరఫున లాయర్లు మాత్రం ఈ విడాకుల కేసు కోర్టులో ఉన్నందున దయచేసి అవాస్తవాలను వార్తలుగా చిత్రీకరించి ప్రచారం చేయవద్దని అందరినీ కోరుతున్నారు.