Begin typing your search above and press return to search.

మూడో ఎన్టీఆర్‌ కనిపించేది అప్పుడే..!

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌ లో తమ హీరో ఎన్టీఆర్‌ ను ఇంకా హీరోయిన్‌ వీణా రావును దసరా సందర్భంగా రివీల్‌ చేస్తామంటూ ప్రకటించాడు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 8:07 AM GMT
మూడో ఎన్టీఆర్‌ కనిపించేది అప్పుడే..!
X

నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నందమూరి తారక రామారావు తనయుడు హరికృష్ణ మనవడు(జానకీరామ్‌ తనయుడు) ఎన్టీఆర్‌ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నాడు. నందమూరి ఫ్యామిలీ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో కొత్త ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్‌, జూనియర్‌ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు మూడో ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ లో అడుగు పెట్టబోతున్నాడు. వరుసగా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి వైవిఎస్ చౌదరి సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ ఆసక్తి పెంచుతున్నాడు.

ఒకప్పుడు పలు సూపర్‌ హిట్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు వైవిఎస్ చౌదరి గత కొంత కాలంగా సక్సెస్‌ లు దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మంచి ఫ్యామిలీ, కమర్షియల్‌ సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు చౌదరి అంటారు. అందుకే ఆయన నుంచి నందమూరి ఫ్యామిలీ నాలుగో తరం హీరో సినిమా అనగానే అందరి దృష్టి అటు వైపుకు మళ్లింది. కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తూ సినిమా రిలీజ్ కోసం వెయిట్‌ చేస్తున్నామని అంటున్నారు.

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన పలు విషయాలను చౌదరి వెల్లడించారు. హీరో ఎన్టీఆర్‌, హీరోయిన్‌ తెలుగు అమ్మాయి వీణా రావు అని, ఈ సినిమా పీరియాడిక్‌ డ్రామాగా 1980 కథతో రూపొందబోతున్నట్టు ప్రకటించాడు. తెలుగు తనం ఉట్టి పడటంతో పాటు, తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేసే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పిన చౌదరి ఒక మంచి రోజు చూసి హీరో, హీరోయిన్‌ లను పరిచయం చేస్తానంటూ ప్రకటించాడు. మొదట హరికృష్ణ పుట్టిన రోజున హీరో ఎన్టీఆర్‌ లుక్ రివీల్‌ చేయాలని భావించినప్పట్టికీ ఆ రోజు బాగా లేదనే ఉద్దేశ్యంతో వాయిదా వేయడం జరిగింది.

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌ లో తమ హీరో ఎన్టీఆర్‌ ను ఇంకా హీరోయిన్‌ వీణా రావును దసరా సందర్భంగా రివీల్‌ చేస్తామంటూ ప్రకటించాడు. టైటిల్‌ ను కూడా అదే సమయంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అచ్చ తెలుగు టైటిల్‌ ను ఇప్పటికే ఖరారు చేయడం జరిగిందని, త్వరలోనే ఆ టైటిల్‌ ను ప్రకటిస్తామని పేర్కొన్నాడు. ఈ సినిమాను గతంలో మాదిరిగా తన బ్యానర్ బొమ్మరిల్లు బ్యానర్‌ లో కాకుండా భార్య గీత నిర్మాణంలో న్యూ టాలెంట్‌ రోర్స్‌ బ్యానర్ లో సినిమాను చేయబోతున్నాడు. విభిన్నమైన కథాంశంతో మూడో ఎన్టీఆర్‌ ను పరిచయం చేయబోతున్న చౌదరికి పూర్వ వైభవం ఈ సినిమాతో దక్కేనా చూడాలి.