Begin typing your search above and press return to search.

ఆమె వల్లే కెరీర్‌ లో ముందుకు వెళ్లలేక పోయా!

మహారాష్ట్రకు చెందిన జరీన్ ఖాన్‌ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి

By:  Tupaki Desk   |   28 July 2023 4:38 AM GMT
ఆమె వల్లే కెరీర్‌ లో ముందుకు వెళ్లలేక పోయా!
X

మహారాష్ట్రకు చెందిన జరీన్ ఖాన్‌ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు ఇంకా పంజాబీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగు లో చాణక్య సినిమాలో ఏజెంట్ జుబెదా పాత్రను పోషించిన జరీన్ ఖాన్ ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే తెలుగు లో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చి ఉండేవి.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం అయినా కూడా ఇంకా ఈ అమ్మడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. అందుకు కారణం ఈమె కత్రీనా కైఫ్ మాదిరిగా ఉండటమే అంటూ బాలీవుడ్ వర్గాల టాక్‌.

తాజాగా ఆ విషయమై జరీన్ ఖాన్ స్పందిస్తూ... కత్రీనా కైఫ్‌ తో నన్ను పోల్చడం వల్లే నా కెరీర్‌ ముందుకు సాగలేక పోయింది. నా సొంతం ప్రతిభను నిరూపించుకునేందుకు అది నాకు పెద్ద అడ్డంకిగా మారింది. ఆమె మాదిరిగా ఉన్నావు అంటూ నన్ను చాలా మంది ప్రశంసించినప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది.

కత్రీనా కైఫ్‌ కి నేను అభిమానిని. అందువల్ల ఆమె మాదిరిగా ఉన్నావు అన్నప్పుడు నాకు సహజంగానే ఆనందంగా ఉంటుంది. కానీ అదే కారణం వల్ల నేను ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ అవ్వలేక పోవడం విచారం కలిగిస్తుందని పేర్కొంది. ఇప్పటికైనా తన సత్తా ను చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.. మంచి పాత్రల కోసం వెయిట్‌ చేస్తున్నాను అన్నట్లుగా జరీన్‌ ఖాన్‌ పేర్కొంది.