Begin typing your search above and press return to search.

మాజీ గాళ్ ప్రెండ్స్ అత‌డిని కిరాత‌కుడ‌న్నారా?

ఆదిత్య పంచోలి-జ‌రీనా వ‌హాబ్ దంప‌తుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 4:30 PM GMT
మాజీ గాళ్ ప్రెండ్స్ అత‌డిని కిరాత‌కుడ‌న్నారా?
X

ఆదిత్య పంచోలి-జ‌రీనా వ‌హాబ్ దంప‌తుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా ఎంతో అన్యోన్యంగా క‌లిసి ఉంటున్నారు. ఇంతో మంది దంప‌తుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. తాజాగా జ‌రీనా వైవాహిక జీవితం గురించి పంచుకున్నారు. `ఓ సినిమా చేస్తోన్న స‌మ‌యంలో నిర్మ‌ల్ ( ఆదిత్య పంచోలి)ను క‌లిసాను. అత‌డు నాకంటే చిన్న వాడు. ఇద్ద‌రు క‌లిసిన 15 రోజుల్లోనే ప్రేమించుకోవ‌డం, పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగింది.

దీంతో అంద‌రూ ఐదు నెల‌లు మించి క‌లిసి ఉండ‌ర‌ని భావించారు. కానీ మేము 36 ఏళ్ల‌గా క‌లిసి ఎంతో సంతోషంగా ఉన్నాం. కానీ అత‌డు ఎవ‌రితోనైనా ఎఫైర్ పెట్టుకుంటాడ‌ని ముందే ఊహించాను. ఇంటికి వ‌చ్చాక అత‌డు నాతో ఎలా ఉంటాడు? అన్న‌దే ప‌ట్టించుకుంటాను త‌ప్ప ఎఫైర్స్ గురించి ప్ర‌శ్నించేదాన్ని కాదు. అత‌డు మాజీ గ‌ర్ల్ ప్రెండ్స్ అన్న‌ట్లుగా? అత‌డేమి కిరాత‌కుడు అయితే కాదు. ఎన్న‌డు నాపై చేయెత్త‌లేదు.

బహుశా వాళ్లు కోరుకుంది జర‌గ‌లేద‌ని అత‌డిపై అలా నింద‌లు వేసారేమో. ఆదిత్య ఉత్త‌మ భ‌ర్త మాత్ర‌మే కాదు. గొప్ప తండ్రి కూడా` అన్నారు. ఆదిత్య పంచోలి పెళ్లైన త‌ర్వాత చాలా మందితో ఎఫైర్లు పెట్టుకున్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. వీరి వివాహం 1986 లో జ‌రిగింది. త‌ర్వాత ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్టు న‌డిపిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. 1993లో పూజాబేడి త‌న‌పై లైంగిక దాడి చేసాడ‌ని ఆదిత్య ఫిర్యాదు చేసింది.

అలాగే 2004లో కంగ‌నా ర‌నౌత్ కూడా చిత్ర హింస‌ల‌కు గురి చేసాడ‌ని ఆరోపించింది. ఆత్యాచారం చేసాడంటూ 2019లో కేసు కూడా పెట్టింది. ఇలా ఆదిత్య పంచోలీపై ర‌క‌ర‌కాల లైంగిక ఆరోప‌ణ‌లున్నాయి. పెళ్లికి ముందు ఆదిత్యా పంచోలి పేరు ఇలాంటి వార్త‌ల్లో ఎన్నోసార్లు వినిపించింద‌ని పాత‌త‌రం చెబుతుంది.