జమ్ము పొలిటీషన్ కొడుకుతోనే ఆమె డేటింగ్!
అతడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికాకపోవడంతో ఏ వ్యాపార వేత్తనో? కార్పోరేట్ కింగ్ అని అనుకుంటున్నారు.
By: Tupaki Desk | 4 July 2024 11:30 PM GMTహృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్ అర్సలన్ గోనీతో రిలేషన షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ తో విడాకుల తర్వాత సస్సానే అర్సలన్ కి దగ్గరైంది. ఇద్దరు కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే అర్సలన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అతడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికాకపోవడంతో ఏ వ్యాపార వేత్తనో? కార్పోరేట్ కింగ్ అని అనుకుంటున్నారు.
కానీ అర్సలన్ బ్యాక్ గ్రాండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. తాజాగా ఈ విషయాన్ని సుస్సానే ఖాన్ తల్లి జరీన్ రివీల్ చేసారు. అలాగే వాళ్లిద్దరి రిలేషన్ షిప్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీ యాంశంగా మారింది. `అర్సలన్ న్యాయవిద్యలో పట్టా పొందాడు. ఎంతో తెలివైన వాడు. జమ్ము లో పేరున్న రాజకీయ నాయకుడు కుటుంబానికి చెందిన వ్యక్తి అతను. కానీ రాజకీయ నాయకుడు అవ్వాలనుకోలేదు.
తనకి సినిమాలంటే ఇష్టం. నటనా రంగంలో రాణించాలనుకుంటున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మంచి వారు. కుమారుడిని ఎంతో బాగా చూసుకుంటారు. సుస్సానే..అర్సలన్ ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.ఒకరితో మరొకరికి సంతోషం దక్కుతుందంటే? తల్లిదండ్రులుగా అందరికీ సంతోషమే కదా. అలాగని పెళ్లి చేసుకుంటేనే ఆ సంతోషం కలకాలం ఉంటుందని లేదు కదా? ఇద్దరు వారి కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారు` అని అన్నారు.
అయితే జరీన్ వ్యాఖ్యలపై కొంత నెగిటివిటీ కూడా వ్యక్తమవుతోంది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండటం ఏంటి? మనం ఏ కల్చర్ లో ఉన్నాం? అంటూ నెటి జనులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ తో విడిపోయినా సుస్సానే ఖాన్ స్నేహితులుగా కలుస్తున్నారు. పిల్లలకు తల్లిదండ్రులుగా అన్ని రకాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.